Sarkaru Vaari Paata : మహేష్ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యది అప్పుడే..

మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు మహేష్.

Sarkaru Vaari Paata : మహేష్ 'సర్కారు వారి పాట' షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యది అప్పుడే..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 06, 2021 | 2:13 PM

Sarkaru Vaari Paata : మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు మహేష్. ఇప్పడు అదే జోష్ లో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు. గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది. దుబాయ్ లో సర్కారు వారి పాట సినిమాకు సంబంధిచిన భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఈ సీన్స్ లో భారీ ఛేజింగ్ కూడా చిత్రీకరించారట. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ , లీకైన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్రయూనిట్ . ఇటీవలే హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలు పెట్టారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండం చేస్తుంది. సెకండ్ వేవ్ కారణంగా టాలీవుడ్ లో షూటింగ్ లకు బ్రేకులు పడ్డాయి. షూటింగ్ లకు ఆలస్యం కావడంతో అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. దాంతో మహేష్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుందట. మరో రెండు నెలల్లో కరోనా ఉదృతి తగ్గితే జులై నుంచి షూటింగ్ ను ప్రారంభించాలని చూస్తున్నారట చిత్రయూనిట్. ఇక ఈసినిమాతో తొలిసారి కీర్తిసురేష్ మహేష్ బాబుతో జతకట్టనుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu: మహేష్ కు జోడీగా బాలీవుడ్ భామ.. త్రివిక్రమ్ సినిమాలో పూరి హీరోయిన్

Samantha- Akkineni Naga Chaitanya: ఈ బ్యూటిఫుల్ కపుల్ సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్ గా రత్తాలు.. నటసింహంతో ఆడిపాడనున్న లక్ష్మీరాయ్ ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!