AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ కు జోడీగా బాలీవుడ్ భామ.. త్రివిక్రమ్ సినిమాలో పూరి హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ నెంబర్ వన్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగాఉన్నాడు.

Mahesh Babu: మహేష్ కు జోడీగా బాలీవుడ్ భామ.. త్రివిక్రమ్ సినిమాలో పూరి హీరోయిన్
Rajeev Rayala
|

Updated on: May 06, 2021 | 9:08 AM

Share

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ నెంబర్ వన్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగాఉన్నాడు. గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు పేరు తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తాన్నాడు. ఈ సినిమాలో  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పరశురామ్. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు మహేష్. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫోటోలు సినిమా పై ఆసక్తిని పెంచేసాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి అతడు, ఖలేజా  విషయం తెలిసిందే. ఇక మహేష్, త్రివిక్రమ్ సినిమా గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని నటిస్తుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాను డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించారు. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. అయితే మహేష్ -త్రివిక్రమ్ సినిమాకు ముందుగా పూజాహెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. ఇప్పుడు దిశా పేరు వినిపిస్తుంది. అయితే ఇటీవల త్రివిక్రమ్ సినిమా అంటే మినిమమ్ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. కాబట్టి ఈ సినిమాలో కూడా ఇద్దరు ఉండే అవకాశం ఉందని, అందుకనే దిశాపటానితో సంప్రదింపులు చేస్తున్నారని అంటున్నారు సినీజనాలు. మరి గురూజీ ప్లాన్ ఏంటో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sonu Sood : సోనూసూద్ పై ప్రసంశలు కురిపించిన నటుడు.. ఎంతో మందికి సోను స్ఫూర్తి ప్రదాత అంటూ కితాబు..

The Family Man: ఫ్యామిలీ మ్యాన్ స్ట్రీమింగ్‌పై మ‌రో అప్‌డేట్‌.. ఈసారైనా విడుద‌ల అవుతుందా..?

Follow Us
ఛీ.. వ్యాక్ఈ వీడియో చూస్తే.. మళ్లీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు
ఛీ.. వ్యాక్ఈ వీడియో చూస్తే.. మళ్లీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?