Samantha- Akkineni Naga Chaitanya: ఈ బ్యూటిఫుల్ కపుల్ సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
టాలీవుడ్ బ్యూటీ ఫుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత కూడా చేస్తూ దూసుకుపోతున్నారు. ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైనా సమంత తక్కువ
Samantha and Akkineni Naga Chaitanya: టాలీవుడ్ బ్యూటీ ఫుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత కూడా చేస్తూ దూసుకుపోతున్నారు. ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన సమంత తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి భారీ విజయాలను అందుకుంది. ఇక అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య కూడా ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఈ ఇద్దరు కలిసి నటించిన ఏమాయచేసావే సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. కొంతకాలం ప్రేమాయణం నడిపిన తర్వాత వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరు సినిమాలను కంటిన్యూ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇద్దరు కలిసి మజిలీ సినిమాలో నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సామ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. శేఖర్ కమ్మల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతన్య. ఈ సినిమా థాంక్యూ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తెరకెక్కుతుంది.
ప్రస్తుతం ఈ ఇద్దరి సంపాదన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సామ్ ఆస్తుల విలువ రూ .84 కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే రెండు స్టార్టప్ లను కలిగి ఉంది. ఒకటి ఫ్యాషన్ లేబుల్ సాకి .. మరొకటి ఎకామ్ అనే ప్రీ-స్కూల్. వీటితో ఈ అమ్మడు రెండు చేతుల సంపాదిస్తుంది. సమంత రూ .76 లక్షల విలువైన విలాసవంతమైన బి.ఎమ్.డబ్ల్యూ కారును కలిగి ఉంది.అంతే కాదు ఈ ముద్దుగుమ్మ ఒక్కొక్క సినిమాకు సుమారు 2 కోట్లవరకు తీసుకుంటుందని తెలుస్తుంది. మరో వైపు నాగచైతన్య కూడా బాగానే సంపాదిస్తున్నాడు. సినీ కెరీర్ లో ఆర్జించినది నికర విలువ 38 కోట్ల రూపాయలు. అంతే కాదు చైతూకి ఖరీదైన కార్లు, బంగ్లాలు ఉన్నాయి. నాగచైతన్యతో పోలిస్తే సంఖ్యా పరంగా ఎక్కువ సినిమాల్లో నటించిన సమంత రూ .84 కోట్ల సంపాదించారని తెలుస్తుంది. చైతన్య – సామ్ ఇద్దరి సంపద కలిపి మొత్తం రూ .122 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు సినీ పండితులు.
మరిన్ని ఇక్కడ చదవండి :