AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Comedian Pandu: సినీ ఇండస్ట్రీని వెంటాడుతున్న మహమ్మారి.. కోవిడ్‌తో నటుడు, కమెడియన్‌ కన్నుమూత

Actor Comedian Pandu: ప్రముఖ కోలీవుడ్‌ నటుడు, ప్రముఖ కమెడియన్‌ పాండు (74) కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో  బాధపడుతున్న ఆయన....

Actor Comedian Pandu: సినీ ఇండస్ట్రీని వెంటాడుతున్న మహమ్మారి.. కోవిడ్‌తో నటుడు, కమెడియన్‌ కన్నుమూత
Actor Comedian Pandu
Subhash Goud
|

Updated on: May 06, 2021 | 11:24 AM

Share

Actor Comedian Pandu: ప్రముఖ నటుడు, ప్రముఖ కమెడియన్‌ పాండు (74) కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో  బాధపడుతున్న ఆయన.. ఇటీవల కరోనా బారిన పడ్డ్డారు. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పాండుకు భార్య కుముద, ముగ్గురు కుమారులున్నారు. కాగా, పాండు భార్య కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.  పాండు మృతి పట్ట సినీ పరిశ్రమ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

పాండు తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నారు. అతను 1970 లో మానవన్ మూవీతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఇందులో ఆయన విద్యార్థి పాత్రను పోషించాడు. ‘కరైల్లెం షేన్‌బాగపూ’తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. కాగా, ఇప్పటికే కరోనాతో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు.

ఇవీ కూడా చదవండి

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు.. అత్య‌ధిక కేసులు న‌మోదైన‌ జిల్లాలు ఇవే

Chaudhary Ajit Singh: కరోనాతో రాష్ట్రీయ లోక్‌ద‌ళ్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి చౌద‌రి అజిత్ సింగ్ క‌న్నుమూత‌