AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy vijay : దళపతి ఫ్యాన్స్ కు పూనకాలే.. భారీ యాక్షన్స్ ఎంటర్టైనర్ గా రానున్న విజయ్ 65..

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి..  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ తోపాటు తెలుగులోనూ  ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు విజయ్.

Thalapathy vijay : దళపతి ఫ్యాన్స్ కు పూనకాలే.. భారీ యాక్షన్స్ ఎంటర్టైనర్ గా రానున్న విజయ్ 65..
Rajeev Rayala
|

Updated on: May 06, 2021 | 12:21 PM

Share

Thalapathy vijay :

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి..  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ తోపాటు తెలుగులోనూ  ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు విజయ్. ఇటీవల మాస్టర్ సినిమాతో సంచలన విజయాన్ని దళపతి. వరుస విజయాలతో సౌత్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు విజయ్.  మాస్టర్ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో విజయ్ కు ప్రత్యర్థిగా మరో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ తన 65వ సినిమాను నెల్సన్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు మేకర్స్.

సినిమాలో అందాల భామ పూజ హెగ్డే  నటిస్తుంది. ఈ సినిమాకోసం బుట్టబొమ్మ బాగానే రెమ్యునరేషన్ అందుకుంటుందట. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాలో కారు ఛేజింగులు .. బైక్ ఛేజింగులు .. గుర్రపు స్వారీలు .. గన్ ఫైట్లు ఉంటాయట. ఇలా భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయట. విజయ్ ఫ్యాన్స్ పూనకాలు తెప్పించేలా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది. సన్ పిక్చర్స్  బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్వరలోనే పవర్ఫుల్ టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే  ఇటీవల విజయ్ డైరెక్ట్ గా తెలుగులో ఓ సినిమా చేస్తున్నాడని టాక్ వచ్చింది. ఈ సినిమాకు వంశీపైడిపల్లి దర్శకత్వం  వహించనున్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయం పై ఇంతవరకు క్లారిటీ రాలేదు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Actor Comedian Pandu: సినీ ఇండస్ట్రీని వెంటాడుతున్న మహమ్మారి.. కోవిడ్‌తో నటుడు, కమెడియన్‌ కన్నుమూత

Sarkaru Vaari Paata : మహేష్ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యది అప్పుడే..

సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్ గా రత్తాలు.. నటసింహంతో ఆడిపాడనున్న లక్ష్మీరాయ్ ..