Sandeep Kishan : సందీప్ కిషన్ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సరికొత్త రికార్డ్..! యూట్యూబ్‌లో 40 మిలియన్లకు పైగా వ్యూస్‌..

Sandeep Kishan : సందీప్ కిషన్ 'ఎ1 ఎక్స్‌ప్రెస్' సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా విడుదలైన రెండు రోజుల్లోనే నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్

Sandeep Kishan : సందీప్ కిషన్ 'ఎ1 ఎక్స్‌ప్రెస్'  సరికొత్త రికార్డ్..! యూట్యూబ్‌లో 40 మిలియన్లకు పైగా వ్యూస్‌..
Sudeep Kishan
Follow us
uppula Raju

|

Updated on: Jul 23, 2021 | 3:13 PM

Sandeep Kishan : సందీప్ కిషన్ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా విడుదలైన రెండు రోజుల్లోనే నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఐదు దేశాల్లో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. మూడు వారాల్లోనే 40 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సంపాదించింది. ఈ చిత్రం ఇప్పుడు జూలై నెలలో అత్యధికంగా వీక్షించిన డబ్బింగ్ చిత్రంగా గుర్తింపు సాధించింది. దీనిపై సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ఇంత గొప్ప స్పందన లభించడంపై చాలా ఆనందంగా ఉందన్నారు. నటుడిగా ఏకైక లక్ష్యం ప్రేక్షకులతో కనెక్ట్ అవడమే. ఈ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడంతో విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

సందీప్ ప్రస్తుతం జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో యాక్షన్ చిత్రం ‘గల్లీ రౌడీ’ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి `చాంగురే చాంగురే…` అనే ఐటెమ్ సాంగ్‌ కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది. నేహా శెట్టి నాయికగా. బాబీ సింహా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తాజాగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుని, సెన్సార్‌ కార్యక్రమాల కోసం సిద్ధమవుతోంది. ‘గల్లీరౌడీ ఈజ్‌ రెడీ’ అంటూ ఈ విషయాన్ని ప్రకటించింది చిత్ర బృందం. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చౌరస్తా రామ్‌, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

సందీప్ కిషన్ సినిమాలలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. సెలూన్, రెస్టారెంట్ బిజినెస్‌లను ప్రారంభించాడు. ఇందులో భాగంగానే తన వ్యాపారాలను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ఆంధ్రప్రదేశ్‌కు సైతం తీసుకెళ్లాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే తన సెలూన్, రెస్టారెంట్ బిజినెస్‌లను విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా దాదాపుగా పూర్తైందని సమాచారం.

Tokyo Olympics 2021 Live: పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ భారత ప్లేయర్స్ పేలవ ప్రదర్శన..

IND vs SL 3rd ODI Live: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

Tokyo Olympics 2021: ప్రపంచ క్రీడా సంగ్రామం ప్రారంభం అయ్యేది ఈరోజే.. ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసా? లైవ్ ఎక్కడ చూడొచ్చు? తెలుసుకోండి!