AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2021: ప్రపంచ క్రీడా సంగ్రామం ప్రారంభం అయ్యేది ఈరోజే.. ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసా? లైవ్ ఎక్కడ చూడొచ్చు? తెలుసుకోండి!

Tokyo Olympics Opening Ceremony: ప్రపంచ క్రీడా సంగ్రామం ఒలింపిక్స్. విభిన్న ప్రజలు.. భిన్న అభిరుచులు..ఎన్నో క్రీడలు.. మరెన్నో విశేషాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని క్రీడాంశాలతో.. అట్టహాసంగా సాగిపోయే ఒలింపిక్స్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది.

Tokyo Olympics 2021: ప్రపంచ క్రీడా సంగ్రామం ప్రారంభం అయ్యేది ఈరోజే.. ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసా? లైవ్ ఎక్కడ చూడొచ్చు? తెలుసుకోండి!
Tokyo Olympics 2021
KVD Varma
|

Updated on: Jul 23, 2021 | 8:50 AM

Share

Tokyo Olympics Opening Ceremony: ప్రపంచ క్రీడా సంగ్రామం ఒలింపిక్స్. విభిన్న ప్రజలు.. భిన్న అభిరుచులు..ఎన్నో క్రీడలు.. మరెన్నో విశేషాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని క్రీడాంశాలతో.. అట్టహాసంగా సాగిపోయే ఒలింపిక్స్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. కరోనా మహమ్మారి కారణంగా 2020లో నిర్వహించాల్సిన ఈ క్రీడోత్సవాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నారు. జపాన్ రాజధాని టోక్యో ఈ ఒలింపిక్స్ కు ఆతిధ్యం ఇస్తోంది. ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఎప్పుడూ లేని విభిన్నమైన పరిస్థితుల్లో ఈసారి ఒలింపిక్స్ జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అడుగడుగునా ఆంక్షల మధ్య ప్రపంచ క్రీడా సమరం జరగబోతోంది. అట్టహాసంగా సాగాల్సిన ప్రారంభోత్సవ వేడుకలు కూడా ఇప్పుడు పరిమిత అనుమతుల మధ్య.. కొద్దిమంది అతిధుల సమక్షంలో జరుపుతున్నారు.

ఎప్పుడు ప్రారంభం అవుతాయి..

ఒలింపిక్స్ 2020 భారత కాలమానం ప్రకారం ఈరోజు అంటే జూలై 23 సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం అవుతాయి. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో శుక్రవారం ఏడుగురు క్రీడలు, ఆరుగురు అధికారులు మొత్తం 20 మంది భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. ఈ కార్యక్రమం గురించి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ మాట్లాడుతూ ”ఈసారి ఒలింపిక్స్ ఇప్పటివరకూ నిర్వహించిన అత్యంత పరిమితమైన క్రీడా కార్యక్రమంగా నిర్వహిస్తారు” అని చెప్పారు. ఇక ఇది ప్రపంచాన్ని ఏకం చేసే క్రీడా వేదిక. ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటానికి సంకేతంగా నిలవాలని అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు.

ఉత్సవంలో ఎంతమంది?

ప్రారంభోత్సవానికి భారత్‌ నుంచి 22 మంది క్రీడాకారులు, ఆరుగురు అధికారులను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రారంభోత్సవాన్ని కేవలం 950 మాత్రమే వీక్షిస్తారు. ప్రపంచదేశాల నుంచి 20 మంది విశిష్ట అతిధులు హాజరవుతారు. జపాన్‌ జక్రవర్తి అకిహితో ఒలింపిక్‌ వేడుకలను ప్రారంభిస్తారు. అమెరికా ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌ కూడా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరువుతు న్నారు.

ప్రారంభోత్సవం చూడటం ఎలా?

ఒలింపిక్స్ క్రీడోత్సవాల ప్రారంభం అంటేనే అతి పెద్ద ఈవెంట్. ప్రపంచం మొత్తం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసే కార్యక్రమం. ఈసారి ఈ కార్యక్రమాలు ప్రత్యక్షంగా చూసే అవకాశం కొద్దిమందికి మాత్రమే దక్కుతోంది. అయితే, అట్టహాసంగా సాగే ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇంట్లోనే కూచుని చూసే విధంగా అనేక టీవీ ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. మన దేశం విషయానికి వస్తే.. స్థానిక సమయం ప్రకారం జూలై 23 సాయంత్రం 4.30 గంటలకు ఈ ఒలింపిక్ ఉత్సవ ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభం అవుతాయి. వీటిని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారతదేశంలో చూడవచ్చు. సోనీ టెన్ 1, సోనీ టెన్ 2 ఇంగ్లీష్ వ్యాఖ్యానంతో ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తాయి. అదేవిధంగా  సోనీ టెన్ 3 లో హిందీ వ్యాఖ్యానం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 4 బిలియన్లకు పైగా ప్రజలు ఈ ఈవెంట్ చూస్తారని అంచనా వేస్తున్నారు.

టోక్యో ఒలింపిక్స్ లో భారత్..

జపాన్ రాజధాని టోక్యోలో  శుక్రవారం  ప్రారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడాసమరంలో  భారతదేశం నుండి 121 మంది సభ్యుల బృందం పాల్గొంటోంది. 124 సంవత్సరాలలో భారతదేశం ఇప్పటివరకు 9 స్వర్ణాలు, 7 రజతాలు, 12 కాంస్యాలతో సహా 28 పతకాలు సాధించింది. హాకీలో గరిష్ట సంఖ్యలో పతకాలు (8 బంగారు, ఒక రజతం మరియు రెండు కాంస్య) వచ్చాయి. ఈ 11 పతకాలలో 4 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్య పతకాలు ఉన్నాయి.

Also Read: Tokyo Olympics 2021 Live: ర్యాంకింగ్ రౌండ్‌లో దీపికా 9వ స్థానం.. కొరియన్ ప్లేయర్ ప్రపంచ రికార్డు..

Tokyo Olympics 2020 Schedule: భారత ఆటగాళ్ల పూర్తి షెడ్యూల్ ఇదే..! రేపటి నుంచే విశ్వ క్రీడలు