AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2021 Live: పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ భారత ప్లేయర్స్ పేలవ ప్రదర్శన..

Ravi Kiran

| Edited By: Venkata Chari

Updated on: Jul 23, 2021 | 4:50 PM

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైంది. 2020లో జరగాల్సిన ఈ క్రీడా సంగ్రామం కరోనా కారణంగా ఈ ఏడాదికి..

Tokyo Olympics 2021 Live: పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ భారత ప్లేయర్స్ పేలవ ప్రదర్శన..
Olympics 1

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైంది. 2020లో జరగాల్సిన ఈ క్రీడా సంగ్రామం కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం విదితమే. కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఈ మెగా ఈవెంట్ మొదలైంది. ఇదిలా ఉంటే ఉదయం 5.30 గంటలకు ఆర్చరీలో మహిళల వ్యక్తిగత క్వాలిఫైయింగ్ రౌండ్ మొదలైంది.

మొదటి రోజు భారత ప్లేయర్స్ ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్స్‌లో పాల్గొన్నారు. మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి తొమ్మిదో స్థానంలో నిలవగా.. ఇక ఆర్చరీ వ్యక్తిగత పురుషుల ర్యాంకింగ్ రౌండ్లో తరుణదీప్ రాయ్, దాస్, ప్రవీణ్ జాదవ్ సరిగ్గా రాణించలేదు. ర్యాంకింగ్ రౌండ్లో మొదటి 25 స్థానాల్లో ఎవ్వరూ చేరలేకపోయారు. మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో కూడా భారత్ ఓడిపోయి తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Jul 2021 02:14 PM (IST)

    ప్రధాని మోదీ జపాన్ ప్రధానికి శుభాకాంక్షలు..

  • 23 Jul 2021 12:46 PM (IST)

    మిక్స్‌డ్ ఈవెంట్‌లో దీపికాతో ప్రవీణ్..

    మహిళల ఆర్చరీ విభాగం నుంచి తొమ్మిదో స్థానంలో నిలిచిన దీపికాతో ప్రవీణ్ కలిసి మిక్స్‌డ్ ఈవెంట్‌లో పాల్గొననున్నారు.

  • 23 Jul 2021 12:25 PM (IST)

    17 ఏళ్ల కిమ్ జే డెక్ టాప్ సీడ్ కానున్నాడు..

  • 23 Jul 2021 12:24 PM (IST)

    భారత పురషుల ఆర్చర్స్ స్కోర్ల వివరాలు..

  • 23 Jul 2021 11:56 AM (IST)

    పురుషుల ర్యాంకింగ్ రౌండ్‌లో భారతీయ ఆర్చర్స్ పేలవ ప్రదర్శన..

    పురుషుల ర్యాంకింగ్ రౌండ్‌లో భారతీయ ఆర్చర్స్ రాణించలేకపోయారు. మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో భారత్‌ భారాన్ని భరించాల్సి ఉంటుంది. చివరి రౌండ్ తర్వాత తుది స్కోరు ఇలా ఉంది

    ప్రవీణ్ జాదవ్ 656 మార్కులతో 31వ స్థానంలో నిలిచాడు.

    దాస్ 652 పాయింట్లతో 35వ స్థానంలో నిలిచాడు

    తరుణదీప్ రాయ్ 652 పాయింట్లు, తక్కువ ఎక్స్‌తో 37 వ స్థానంలో నిలిచాడు

  • 23 Jul 2021 11:56 AM (IST)

    10వ రౌండ్ తర్వాత ఏ భారత ప్లేయర్ కూడా టాప్ 25లో లేరు..

    10 రౌండ్ల ఆట పూర్తయింది. భారతీయ ఆర్చర్లలో ఎవరూ టాప్ 25కి చేరుకోలేదు. 10వ రౌండ్లో 56 పాయింట్లు సాధించి ప్రవీణ్ జాదవ్ ప్రస్తుతం ముగ్గురు భారతీయ ఆర్చర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు, అతను 26వ స్థానంలో ఉన్నాడు. దాస్ కూడా 56 పాయింట్లు సాధించినా 28వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు, తరుణదీప్ 54 పాయింట్లు సాధించి 38వ స్థానంలో ఉన్నాడు.

  • 23 Jul 2021 11:17 AM (IST)

    మిక్స్‌డ్ ఈవెంట్ జట్టు ఆరో స్థానానికి పడిపోయింది

    దాస్ ర్యాంకింగ్ కారణంగా భారత్ మిక్స్‌డ్ ఈవెంట్ జట్టు కూడా ఆరో స్థానానికి పడిపోయింది. దీపికా, దాస్ ఇద్దరూ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌ను ఆడనున్నారు.

  • 23 Jul 2021 11:16 AM (IST)

    ప్రవీణ్ జాదవ్ 27వ స్థానానికి చేరుకున్నాడు..

    సెకండాఫ్ మొదలైంది. ప్రవీణ్ జాదవ్ ఏడో రౌండ్‌లో 55 పాయింట్లు సాధించాడు. దాస్ 55, తరుణదీప్ రాయ్ 54 పాయింట్లు స్కోర్ చేశారు.

  • 23 Jul 2021 11:01 AM (IST)

    ఇండియా మళ్లీ పుంజుకోవాలి..

    ద్వితీయార్ధంలో భారత ఆటగాళ్ళు మెరుగైన ఆట చూపించాల్సి ఉంటుంది. ఇది గనక జరగకపోతే.. డ్రాలో స్ట్రాంగ్ ప్లేయర్స్‌తో పోటీ పడాల్సి ఉంటుంది.

  • 23 Jul 2021 11:01 AM (IST)

    ఫస్ట్ హాఫ్ తర్వాత స్కోర్ల వివరాలు..

    మొదటి సగం రౌండ్లు ముగిశాయి. ప్రస్తుతానికి భారత అథ్లెటిక్స్ నిరాశపరిచారు. ప్రవీణ్ యాదవ్ 329 స్కోరుతో 30వ స్థానంలో, దాస్ 329 పాయింట్లతో 31వ స్థానంలో ఉన్నారు. తరుణదీప్ రాయ్ 323 పాయింట్లతో 45వ స్థానంలో ఉన్నారు. కొరియా అథ్లెటిక్స్ ఇక్కడ కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.

  • 23 Jul 2021 11:01 AM (IST)

    చెలరేగిన ఎ.దాస్..

    రెండవ రౌండ్లో పేలవమైన ఆట తరువాత, దాస్ చెలరేగాడు. X-10-9-9-9తో 11వ స్థానానికి చేరుకున్నాడు. తరుణదీప్ 53 పాయింట్లతో 35వ స్థానానికి చేరుకున్నాడు

  • 23 Jul 2021 10:09 AM (IST)

    టాప్ 10లో ముగ్గురు భారత్ ఆటగాళ్లు..

    ముగ్గురు ఆటగాళ్లకు రెండో రౌండ్ పెద్దగా కలిసి రాలేదు. దాస్ 54, తరుణదీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ 55 పాయింట్స్ సాధించారు. ముగ్గురూ టాప్ 10లో ఉన్నారు.

  • 23 Jul 2021 10:09 AM (IST)

    ఆర్చరీ పురుషుల ర్యాంకింగ్ రౌండ్ ప్రారంభం..

    అతాను దాస్ తొలి రౌండ్‌లో 58 పాయింట్లు సాధించాడు. ఈ రౌండ్లో అతడు X-10-10-10-9-9 స్కోరు సాధించాడు. దాస్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. తరుణదీప్ రాయ్ 55 పాయింట్లతో 31వ స్థానంలో, ప్రవీణ్ జాదవ్ 51 పాయింట్లతో 40వ స్థానంలో ఉన్నారు.

  • 23 Jul 2021 08:42 AM (IST)

    క్వార్టర్ ఫైనల్లో ఆన్ శాన్‌తో దీపిక ఢీ..!

    క్వార్టర్ ఫైనల్స్‌లో 32వ రౌండ్, 16వ రౌండ్ తర్వాత ఒలింపిక్ రికార్డు సృష్టించిన కొరియాకు చెందిన ఆన్ శాన్‌తో దీపిక తలపడవచ్చు.

  • 23 Jul 2021 08:33 AM (IST)

    ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్న పురుషుల ర్యాంకింగ్ రౌండ్

    భారత్ నుంచి వ్యక్తిగత పురుషుల ర్యాంకింగ్ రౌండ్లో ముగ్గురు ఆర్చర్స్ పాల్గొంటారు. భారత నెంబర్ వన్ ప్లేయర్ అతాను దాస్, తరుణదీప్ రాయ్, ప్రణీవ్ జాదవ్ పోటీ పడుతున్నారు.

  • 23 Jul 2021 08:30 AM (IST)

    ప్రపంచ రికార్డు సృష్టించిన కొరియన్ ప్లేయర్..

    అనుకున్నదే జరిగింది. కొరియాకు చెందిన ముగ్గురు ఆర్చర్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మొదటి ర్యాంక్ ఎం శాన్ ర్యాంకింగ్ రౌండ్లో 680 స్కోరుతో ఒలింపిక్ రికార్డును నెలకొల్పింది, గతంలో 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో నమోదైన 673 స్కోర్‌ను అధిగమించింది.

  • 23 Jul 2021 08:29 AM (IST)

    ర్యాంకింగ్ రౌండ్‌లో 9వ స్థానాన్ని దక్కించుకున్న దీపికా

    చివరి రౌండ్‌లో దీపిక అద్భుతాలు సృస్టించలేకపోయింది. ఈ రౌండ్‌లో ఆమె X-10-9-9-9-7 స్కోరు చేసి 54 పాయింట్లు సాధించాడు. మొత్తం 663 స్కోరుతో దీపిక తొమ్మిదో స్థానంలో నిలిచింది.

  • 23 Jul 2021 08:28 AM (IST)

    11వ రౌండ్‌లో మళ్లీ నిరాశ..

    దీపికా కుమారికి 11 వ రౌండ్లో ఒక్క ఎక్స్ (పర్ఫెక్ట్ స్కోరు, కుడివైపున), 10 రాలేదు. ఈ కారణంగా ఆమె ఏడవ స్థానానికి పడిపోయింది. ఈ రౌండ్లో ఆమె స్కోరు 9-9-9-9-9-8.

  • 23 Jul 2021 08:28 AM (IST)

    దీపిక ఆరో స్థానానికి చేరుకుంది

    10వ రౌండ్లో దీపిక అద్భుతంగా పుంజుకుంది. ఈసారి 58 పాయింట్లు సాధించింది. ఆమె 10వ రౌండ్ స్కోర్ XX-10-10-9-9. దీనితో ఆరో స్థానానికి చేరుకుంది. ఇక కొరియన్ ప్లేయర్స్ ముగ్గురూ కూడా మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.

  • 23 Jul 2021 08:28 AM (IST)

    దీపిక ముందు మూడు ఛాన్స్‌లు..

    తొమ్మిదవ రౌండ్‌లో దీపికా కుమారి చివరి షాట్‌కు మరో 7 పాయింట్స్ సాధించింది. ఈ రౌండ్లో XX-10-10-9-7 ఆమె స్కోర్. ఇక దీపికకు మరో మూడు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

  • 23 Jul 2021 08:20 AM (IST)

    దీపిక కుమారి ఎనిమిదో స్థానానికి పడిపోయింది

    దీపిక కుమారికి ఎనిమిదో రౌండ్ కలిసొచ్చింది. అయితే చివరి షాట్‌లో మాత్రం ఎక్కువ పాయింట్స్ సాధించలేకపోయింది. ఈ రౌండ్‌లో ఆమె స్కోర్ 10-9-9-9-9-7. ప్రస్తుతం ఎనిమిదో స్థానానికి పడిపోయింది.

  • 23 Jul 2021 08:19 AM (IST)

    ఏడవ రౌండ్‌లో దీపిక 55 పాయింట్లు సాధించింది

    ఏడవ రౌండ్లో దీపిక మంచి ఆరంభం సాధించింది, కానీ చివరికి నిరాశపరిచింది. ఈసారి 55 పాయింట్లు పొందింది. ఈ రౌండ్లో ఆమె స్కోర్ వివరాలు X-10-9-9-9-8

  • 23 Jul 2021 08:19 AM (IST)

    ఒలింపిక్ రికార్డును బద్దలకొట్టే దిశగా కొరియా క్రీడాకారిణి..

    కొరియాకు చెందిన ఆన్ శాన్ ర్యాంకింగ్ రౌండ్లో ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టడానికి దగ్గరగా ఉంది. ర్యాంకింగ్ రౌండ్లో ఇప్పటివరకు ఉన్న అత్యుత్తమ స్కోరు 673 కాగా, ఆరు రౌండ్ల తరువాత, శాన్ స్కోర్ 345 పాయింట్లు. ఇదే ఆటతీరు కొనసాగితే ర్యాంకింగ్ రౌండ్‌లో ప్రపంచ రికార్డు బద్దలుకావడం ఖాయం.

  • 23 Jul 2021 08:05 AM (IST)

    Tokyo Olympics 2021 Live: ఆరో రౌండ్‌కు 57 పాయింట్లు సాధించిన దీపికా కుమారి

    ఆరో రౌండ్ ముగిసేసరికి దీపికా కుమారి 57 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం ఆమె టోటల్ స్కోర్ 334

  • 23 Jul 2021 07:59 AM (IST)

    Tokyo Olympics 2021 Live: 14వ స్థానంలో దీపికా కుమారి

    నాలుగో రౌండ్ ముగిసేసరికి దీపికా కుమారి 14వ స్థానంలో నిలిచింది. ఆమె స్కోర్ 51 కాగా.. 218 పాయింట్లు దక్కించుకుంది.

  • 23 Jul 2021 07:53 AM (IST)

    Tokyo Olympics 2021 Live: ఉదయం 5.30 గంటలకు ఆర్చరీలో మహిళల వ్యక్తిగత క్వాలిఫైయింగ్ రౌండ్ మొదలు..

    ఉదయం 5.30 గంటలకు ఆర్చరీలో మహిళల వ్యక్తిగత క్వాలిఫైయింగ్ రౌండ్ మొదలైంది. భారత్ నుంచి ఆర్చర్ దీపికా కుమారి పోటీపడుతుండగా.. ఆమె స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి.

    Deepika Kumari

  • 23 Jul 2021 07:52 AM (IST)

    Tokyo Olympics 2021 Live: భారీ టీంను పంపించిన భారత్.. చరిత్ర తిరగరాయడం ఖాయం.!

    రియో ఒలింపిక్స్‌లో భారత్ కేవలం రెండు మెడల్స్ మాత్రమే దక్కించుకుంది. బ్యాడ్మింట‌న్‌లో సింధు సిల్వర్‌ మెడ‌ల్‌, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ బ్రాంజ్ మెడ‌ల్ గెలిచారు. ఈసారి భారత్ నుంచి 127 మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా చరిత్రను తిరగరాసే అవకాశాలు చాలానే ఉన్నాయి.

  • 23 Jul 2021 07:45 AM (IST)

    Tokyo Olympics 2021 Live: భారత్ నుంచి ఎంతమంది అథ్లెటిక్స్ పోటీ పడుతున్నారు.!

    ఎన్నడు లేని విధంగా ఈసారి భారత్‌ నుంచి 127 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. అధికారులు, కోచ్‌లు, ఇత‌ర స‌హాయ సిబ్బంది క‌లిపితే ఈ సంఖ్య 228కి చేరుతుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో కేవ‌లం రెండే మెడ‌ల్స్ గెలిచి నిరాశప‌రిచిన ఇండియా.. ఈసారి ఆ సంఖ్యను పెంచుకోవాలన్న పట్టుదలతో ఉంది. రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింట‌న్‌లో సింధు సిల్వర్‌ మెడ‌ల్‌, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ బ్రాంజ్ మెడ‌ల్ గెలిచారు. ఇక ఏ గేమ్‌లోనూ మెడ‌ల్స్ రాలేదు. కానీ ఈసారి మాత్రం చ‌రిత్రను తిర‌గ‌రాసే అవ‌కాశాలు చాలానే క‌నిపిస్తున్నాయి

  • 23 Jul 2021 07:44 AM (IST)

    Tokyo Olympics 2021 Live: ప్రారంభోత్సవానికి హాజరయ్యేది ఎవరెవరు.?

    టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి భారత్‌ నుంచి 22 మంది క్రీడాకారులు, ఆరుగురు అధికారులను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రారంభోత్సవాన్ని కేవలం 950 మాత్రమే వీక్షిస్తారు. ప్రపంచదేశాల నుంచి 20 మంది విశిష్ట అతిధులు హాజరవుతారు. జపాన్‌ జక్రవర్తి అకిహితో ఒలింపిక్‌ వేడుకలను ప్రారంభిస్తారు. అమెరికా ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌ కూడా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరువుతన్నారు. జపాన్‌ ప్రధాని సుగా ఆమెకు ఘనస్వాగతం పలికారు. టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణలో తెలుగువాళ్లు కూడా భాగస్వామ్యులయ్యారు. టోక్యో ఒలింపిక్స్‌కు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.

  • 23 Jul 2021 07:42 AM (IST)

    నేడే టోక్యో ఒలింపిక్స్ షూరూ.. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభ వేడుకలు

    ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న టోక్యో ఒలింపిక్స్ ఎట్టకేలకు ప్రారంభమైంది. 2020లో జరగాల్సిన ఈ క్రీడా సంగ్రామం కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం విదితమే. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఒలింపిక్స్‌ వేడుకలు ప్రారంభమవుతాయి.

Published On - Jul 23,2021 2:14 PM

Follow us