Olympics 2021 Opening Ceremony Highlights: విశ్వ క్రీడా మహోత్సవం ప్రారంభం.. భారత అథ్లెట్లకు చప్పట్లతో వెల్‌కం చెప్పిన ప్రధాని మోడీ
Tokyo Olympics Ceremony 2021 Live Updates: ప్రపంచ క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని క్రీడాంశాలతో.. అట్టహాసంగా సాగిపోయే ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా మొదలవుతున్నాయి.
Olympics 2021 Opening Ceremony Live: ప్రపంచ క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని క్రీడాంశాలతో.. అట్టహాసంగా సాగిపోయే ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా మొదలవుతున్నాయి. ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఎప్పుడూ లేని విభిన్నమైన పరిస్థితుల్లో ఈసారి ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత అనుమతుల మధ్య.. కొద్దిమంది అతిధుల సమక్షంలో ఈవేడుకలు జరుతున్నాయి.
ప్రారంభోత్సవానికి భారత్ నుంచి 22 మంది క్రీడాకారులు, ఆరుగురు అధికారులు హాజరయ్యారు. ప్రపంచదేశాల నుంచి 20 మంది విశిష్ట అతిధులు హాజరయ్యారు. జపాన్ జక్రవర్తి అకిహితో ఒలింపిక్ వేడుకలను ప్రారంచనున్నారు. అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఒలింపిక్స్ క్రీడాసమరంలో భారతదేశం నుంచి 121 మంది సభ్యుల బృందం పాల్గొంటోంది. 124 సంవత్సరాలలో భారతదేశం ఇప్పటివరకు 9 స్వర్ణాలు, 7 రజతాలు, 12 కాంస్యాలతో సహా 28 పతకాలు సాధించింది. హాకీలో గరిష్ట సంఖ్యలో పతకాలు (8 బంగారు, ఒక రజతం, రెండు కాంస్య) దక్కాయి. ఈ 11 పతకాలలో 4 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్య పతకాలు ఉన్నాయి.
‘Ek India Team India’ – Celebrating 100 years of our athletes at the Olympic Games. We are delighted to present the new identity of the Indian Olympic Association and #TeamIndia??
It signals our arrival on the world stage and we’re ready.#EkIndiaTeamIndia pic.twitter.com/O1ClImzRgW
— Team India (@WeAreTeamIndia) August 15, 2020
LIVE NEWS & UPDATES
-
జపాన్ చక్రవర్తి అధికారిక ప్రకటన
జపాన్ చక్రవర్తి నరుహిటో 32 వ ఒలింపిక్ క్రీడలను అధికారికంగా ప్రకటించారు. రాబోయే 16 రోజులపాటు జపాన్‌లో ఈ ఉత్సవం జరగనుంది.
-
1824 డ్రోన్లతో..
కవాతు తరువాత, ఒలింపిక్స్ థీమ్ ‘ఫాస్ట్ హయ్యర్ స్ట్రాంగర్ టుగెదర్’ ప్రదర్శన జరిగింది. అనంతరం టోక్యో 2020 చిహ్నాన్ని 1824 డ్రోన్లు ఉపయోగించి తయారుచేశారు.
-
-
జపాన్‌తో కవాతు ముగుస్తుంది
ఒలింపిక్ ప్రారంభోత్సవంలో నిర్వహస్తోన్న పరేడ్ ఆతిథ్య జపాన్‌తో ముగుస్తుంది. ఈ పోటీల్లో జపాన్ నుంచి 552 మంది ఆటగాళ్లు సత్తా చాటనున్నారు.
-
అమెరికా..
అమెరికా టోక్యో ఒలింపిక్స్‌లో 613 మంది ఆటగాళ్లతో పాల్గొననుంది. అత్యధిక క్రీడాకారులతో తొలిస్థానంలో నిలిచింది. ఎక్కువ పతకాలు సాధించే లిస్టులో కూడా మొదటి స్థానంలో ఉంటుంది.
-
భారత అథ్లెట్లకు చప్పట్లతో వెల్‌కం చెప్పిన ప్రధాని (వీడియో)
#WATCH | Prime Minister Narendra Modi stands up to cheer athletes as the Indian contingent enters Olympic Stadium in Tokyo during the opening ceremony.#TokyoOlympics pic.twitter.com/SUheVMAqIK
— ANI (@ANI) July 23, 2021
-
-
ఆకట్టుకున్న టోంగా ఆటగాడి దుస్తులు..
కవాతు కోసం టోంగా బృందం స్టేడియంలోకి ఎంటరైంది. అందరి కళ్లు టోంగా ప్లేయర్ పీటా టఫుటోఫువా దుస్తులు మీద పడ్డాయి. ఆ దేశ సంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకున్నాడు. ట్వైక్వాండో పోటీలో బరిలోకి దిగనున్నాడు.
-
ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
టోక్యో ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసిన మోడీ.. కవాతులో భారత అథ్లెట్లు ప్రవేశించినప్పుడు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ వెల్‌కం చెప్పారు. అలాగే సత్తా చాటాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ప్రధాని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
-
కవాతులో చైనా ప్రవేశం..
ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు సాధించే లిస్టులో చైనా కూడా ఒకటి. ఇప్పుడే ఆదేశానికి చెందిన ఆటగాళ్లు కవాతులోకి ఎంటరయ్యారు. ఈసారి 406 మంది ఆటగాళ్లతో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతోంది. ఇందులో చాలామంది ఆటగాళ్లు పతకాన్ని సాధించే లిస్టులో ఉన్నారు.
-
చిక్కుల్లో కిర్గిజ్స్తాన్ ఆటగాళ్లు..
ఒలింపిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. అయితే వీరిలో కొందరికి మాస్కులు లేవు. దీంతో ఒలింపిక్ ప్లేబుక్‌లోని నింబధనలు పాటించకుండా స్టేడియంలోకి ఎంటరయ్యారు.
-
12 ఏళ్లకే పతాకధారిగ అవకాశం..
ఒలింపిక్ ప్రారంభోత్సవ వేడుకల్లో అహ్మద్ సాబెర్ హమ్చోతోపాటు హెండ్ జాజా సిరియా తరపున పతాకధారులుగా వ్యవహరించారు. అయితే, హెడ్ జాజా.. తొలిసారి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటుంది. 12 ఏళ్ల జాజా టేబుల్ టెన్నిస్‌లో బరిలోకి దిగనుంది. అయితే తొలి ఒలింపిక్ ఆడుతున్న జాజా, పతాకధారిగా అవకాశం దక్కించుకోవడం విశేషం.
-
కవాతులో పాల్గొన్న శరణార్థుల టీం..
ఒలింపిక్ స్టేడియంలో నిర్వహించిన కవాతులో శరణార్థుల టీం కూడా పాల్గొంది. రెండవసారి ఒలింపిక్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. వీరు ఒలింపిక్ జెండాను పట్టుకుని కవాతులో పాల్గొన్నారు. తొలిసారి 2016లో వీరు రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.
-
వన్ బిలియన్ ప్రజల ఆశలను మోసుకుంటూ..
వన్ బిలియన్ ప్రజల ఆశలను మోసుకుంటూ త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని స్టేడియంలో కవాతు చేశారు భారత ఆటగాళ్లు. ఈమేరకు ఒలింపిక్స్ తన అధికార ట్విట్టర్లో ఓ ఫొటోను పంచుకుంది.
They’re here and they’re representing over 1 BILLION people! #IND
Proudly carrying the flag are Olympic boxing medallist Mary Kom and hockey star Manpreet Singh for @WeAreTeamIndia.#StrongerTogether #OpeningCeremony pic.twitter.com/XpNbvd00oH
— Olympics (@Olympics) July 23, 2021
-
అందరి దృష్టిని ఆకర్షించిన అంగోలా ఆటగాళ్ళు..
కవాతులో పాల్గొన్న అంగోలా ఆటగాళ్ళు వారి దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించారు. సాంప్రదాయ దుస్తులలో అంగోలా దేశ జెండా ధరించి స్టేడియంలో నడిచారు.
-
భారతదేశం తరువాత ఈ దేశాలు..
భారతదేశం తరువాత, ఇండోనేషియా, ఉగాండా, ఉక్రెయిన్, ఉరుగ్వే, గ్రేట్ బ్రిటన్, ఈజిప్ట్, కెనడా, ఖతార్, కజాఖ్స్తాన్, గయానా, ఒమన్, ఆస్ట్రేలియా, కామెరూన్, గాంబియా, కంబోడియా, గినియా, సైప్రస్, క్యూబా దేశాలు కూడా కవాతులో పాల్గొన్నాయి.
-
ప్రౌడ్ మూమెంట్..
భారత ఆటగాళ్లు త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని ఒలింపిక్ స్టేడియంలోకి ప్రవేశించారు.
-
భారత జట్టు ప్రవేశం..
భారత జట్టు మార్చ్ ఫాస్ట్ ఇప్పుడే మొదలైంది. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తలపాగా ధరించి, భారత జెండాను చేతపట్టుకున్నాడు. అతని పక్కనే మేరీ కోమ్ కూడా ఉన్నారు. ఈ మార్చ్ ఫాస్ట్‌లో భారతదేశం నుంచి 19 మంది ఆటగాళ్ళు, ఆరుగురు అధికారులు పాల్గొన్నారు.
-
మార్చ్ పాస్ట్ ప్రారంభం, మాస్క్‌లతో ఆటగాళ్లు
పలు ప్రదర్శనల అనంరతం ప్రతీ దేశం నుంచి ఆటగాళ్ల బృందాలు ఒలింపిక్ స్గేడియంలోకి వస్తున్నాయి. మార్చ్ ఫాస్ట్ చేసేందుకు వస్తున్నారు. తొలుత గ్రీస్ ఆటగాళ్లు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరూ మాస్క్‌లు ధరించి మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొంటున్నారు.
-
మహ్మద్ యూనస్‌కు ప్రత్యేక గౌరవం
బంగ్లాదేశ్ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్‌కు ఒలింపిక్ లారెల్ బహుమతిని ఐఓసీ ప్రదానం చేసింది. యూనస్ క్రీడల కోసం చేసిన కృషికి ఈ అవార్డు బహూకరించింది.
-
ప్రత్యేక ఒలింపిక్ రింగులు
ఒలింపిక్ స్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన ఒలింపిక్ రింగులను ప్రదర్శించారు. అయితే వీటికో ప్రత్యేకత ఉంది. అందేటంటే.. 1964 లో నాటిన చెట్ల నుంచి వీటిని తయారుచేశారు. ప్రతీ రింగ్ నాలుగు మీటర్ల వ్యాసం కలిగిఉంది.
-
కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి స్మరణతో..
కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోయిన వారిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అలాగే 1972లో చనిపోయిన ఇజ్రాయిల్ జట్టును ప్రత్యేకంగా ప్రస్తావించి కొంతసేపు మౌనం పాటించారు.
-
ఒంటరి కాదు…
COVID-19 తో చాలా మంది అథ్లెట్లు ఒంటరిగా శిక్షణ పొందాల్సి వచ్చింది. అది కేవలం శిక్షణ మాత్రమే.. కానీ వారు ఎల్లప్పుడూ వారి ఆశలు, అభిరుచికి మాత్రం ఒంటరివారు కాదంటూ థీమ్‌న్ ప్రదర్శించారు.
-
ఆకట్టుకున్న నృత్యాలు..
ఎరుపు రిబ్బన్‌తో నృత్యకారులు అద్భుతమైన ప్రదర్శన చేశారు.
We’re all connected ?#Tokyo2020 | #Olympics | #UnitedByEmotioin | #StrongerTogether pic.twitter.com/i8qOrn7oUK
— #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021
-
స్టేడియంలోకి ఎంటరైన జపాన్ ఫ్లాగ్
అట్టహాసంగా మొదలైన ఒలింపిక్ వేడుకల్లో… మొదటగా జపాన్ క్రీడాకారులు తమ దేశ పతాకాన్ని చేతపట్టుకుని ఒలింపిక్ స్టేడియంలోకి ఎంటరయ్యారు.
The Japanese flag?? has entered the Olympic stadium ?️ at the #Tokyo2020 #OpeningCeremony#UnitedByEmotion | #StrongerTogether | #Olympics pic.twitter.com/WjcL2zeX8U
— #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021
-
వెలుగులు విరజిమ్ముతూ ప్రారంభమైన వేడుకలు..
The #OpeningCeremony has begun! ♥️#Tokyo2020 | #Olympics #StrongerTogether | #UnitedByEmotion pic.twitter.com/dt0FmadWf8
— #Tokyo2020 for India (@Tokyo2020hi) July 23, 2021
? #Tokyo2020 pic.twitter.com/eqePwS7vYp
— #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021
-
ప్రారంభమైన వేడుకలు
గతేడాది జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు కరోనాతో ఈఏడాది టోక్యో వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈమేరకు నేడు నిర్వహించే ప్రారంభ వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. జపాన్ రాజధాని టోక్యోలోని ఒలింపిక్ స్టేడియంలో విశ్వ క్రీడలు ప్రారంభమైనట్లు ప్రకటించారు.
No more waiting. It’s time for #Tokyo2020
— #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021
नमस्ते World!???
No more waiting. It’s time for #Tokyo2020#TeamIndia pic.twitter.com/9oTOKOStGa
— Team India (@WeAreTeamIndia) July 23, 2021
-
మరో 10 నిమిషాల్లో..
? ?️ Just ? minutes until the #Tokyo2020 #OpeningCeremony begins ⏰ ?#Olympics | #UnitedByEmotion | #StrongerTogether pic.twitter.com/FXckQ6DS6j
— #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021
-
సాథియన్ కూడా రెడీ..
ఒలింపిక్ ప్రారంభోత్సవంలో భారత పురుషుల టేబుల్ టెన్నిస్ ప్లేయర్ జి. సత్యన్ కూడా ఎంటరవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈమేరకు సత్యన్ ట్విట్టర్‌లో కొన్ని ఫోటోలను కూడా పంచుకున్నాడు. ఈ ఫొటోలలో పలువురు భారత ఆటగాళ్లు భారత పతాకాలను చేతపట్టుకుని కనిపించారు.
All set and suited up for the big day?? It’s finally time for the Opening ceremony of the Tokyo 2020 Olympic Games ? Catch live action in Sony tonight at 16.30 hrs IST !!#sathiyantt #tabletennis #sports #tokyo2020 #olympics #openingceremony #TeamIndia pic.twitter.com/vSWidhxYCC
— Sathiyan Gnanasekaran (@sathiyantt) July 23, 2021
-
పతాకధారులు సిద్ధం
ప్రారంభోత్సవానికి మేరీ కోమ్ సిద్ధంగా ఉంది. ఈమేరకు ఆమె తన ట్విట్టర్లో కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రారంభోత్సవంలో భారత త్రివర్ణాన్ని చేతపట్టుకుని భారత అథ్లెట్లను ముందుకు నడింపిచనున్నారు.
Here I stand before the opening ceremony of #Tokyo2020 as a flag bear of my nation, India. #Cheer4India pic.twitter.com/hNkixkoxBt
— M C Mary Kom OLY (@MangteC) July 23, 2021
Published On - Jul 23,2021 8:07 PM