- Telugu News Photo Gallery Tokyo olympics 2020-21 photos Manpreet singh and mary kom lead indian olympic athletes at tokyo olympics ceremony
Tokyo Olympics 2021: అట్టహాసంగా ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం.. సాంప్రదాయ శైలిలో ఆకట్టుకున్న భారత ఆటగాళ్లు
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ 2020 ప్రారంభోత్సవంతో క్రీడలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 8 వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, బాక్సర్ మేరీ కోమ్ భారత జట్టుకు నాయకత్వం వహించారు.
Updated on: Jul 23, 2021 | 10:03 PM

32 వ ఒలింపిక్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జపనీస్ సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానం ప్రారంభోత్సవంలో కనిపించింది. కరోనా కారణంగా గత సంవత్సరం వాయిదా పడిన ఈ ఆటలు ఒక సంవత్సరం ఆలస్యంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ సీకో హషిమోటో, 205 దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, క్రీడాకారుల సమక్షంలో జపాన్ చక్రవర్తి నరుహిటో క్రీడల ప్రారంభాన్ని ప్రకటించారు.

భారతదేశం 25 వ సారి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటోంది. ఈసారి ఎక్కువ సంఖ్యలో భారత క్రీడాకారులు రంగంలోకి దిగారు. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఎంసీ మేరీ కోమ్ పతాకధారులుగా వ్యవహరించారు.

ఒలింపిక్స్‌లో 127 మంది ఆటగాళ్లతో సహా 228 మంది సభ్యుల బృందం భారత్ నుంచి పాల్గొంటోంది. అయితే ఈ ప్రారంభోత్సవంలో 20 మంది ఆటగాళ్లు మాత్రమే పాల్గొన్నారు. జులై 24 న చాలా మంది ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.

టోక్యో ఒలింపిక్స్ 2020 ప్రారంభోత్సవంలో భారతీయ ఆటగాళ్ళు సాంప్రదాయ భారతీయ దుస్తులలో కనిపించారు.

టోక్యో ఒలింపిక్స్ 2021 ప్రారంభోత్సవంలో ఇండియన్ సెయిలింగ్ టీం సభ్యులు కూడా కనిపించారు.

టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత బాక్సర్ల నుంచి చాలా అంచనాలు ఉన్నాయి. ప్రారంభోత్సవంలో బాక్సింగ్ జట్టు సభ్యుల కూడా హాజరయ్యారు.




