IND vs SL 3rd ODI Highlights: టీమిండియాపై శ్రీలంక విజయం.. మూడు వికెట్ల తేడాతో మూడో వన్డేను గెలిచిన లంకేయులు..

India vs Sri Lanka 3rd ODI Live Score: మూడవ వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs SL 3rd ODI Highlights: టీమిండియాపై శ్రీలంక విజయం.. మూడు వికెట్ల తేడాతో మూడో వన్డేను గెలిచిన లంకేయులు..
India Vs Srilanka

IND vs SL 3rd ODI: శ్రీలంకతో మూడు వన్డేలో సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంక ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు వన్డేల్లో రాణించిన భారత ప్లేయర్స్‌ మూడో వన్డేలో మాత్రం తడబడ్డారు. ముఖ్యంగా భారత బ్యాట్స్‌మెన్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. టీమిండియా 43.1 ఓవర్‌లలో 225 పరుగులకే పరిమితమైంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లంకీయులు మొదటి నుంచి దూకుడుగానే ఆడారు. మ్యాచ్‌ ముగిసే సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ చివరికి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే మూడు వన్డేలా సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుంది.

ఇక అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 29 పరుగుల వద్ద శిఖర్ దావన్ రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత సంజు శాంసన్, ప్రుధ్వీషా ఇద్దరు కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో పృథ్వీషా.. దసున్ శనక బౌలింగ్‌లో 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీగా ఔటయ్యాడు. తర్వాత 19 ఓవర్‌లో సంజు శాంసన్ 46 పరుగులు కూడా ఔటయ్యాడు. స్వల్ప పరుగుల తేడాతో ఇద్దరు అర్ధ సెంచరీలు చేజార్చుకున్నారు. ఈ క్రమంలో భారత్ 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. గంట తర్వాత మ్యాచ్‌ని 47 ఓవర్లకు కుదించారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు వెంటనే మనీశ్ 158 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్య ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. 184 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడుతూ..40 పరుగుల వద్ద ఎల్బీ గా ఔటయ్యాడు. ఆ తర్వాత ధనుంజయ వేసిన 33 ఓవర్‌లో భారత్ రెండు వికెట్లు వెనువెంటనే కోల్పోయింది. దీంతో 195 పరుగులకు 8 వికెట్లు చేజార్చుకుంది. చివరలో టెయిలెండర్లు మరో 30 పరుగులు జోడించి 43.1 ఓవర్లో 225 పరుగులకు ఆలౌట్ అయ్యారు. లంక బౌలర్ అకిల ధనంజయ, జయవిక్రమ 3 వికెట్లు సాధించారు.

టీమిండియా తరపున ఒకేసారి ఐదుగురు అరంగేట్రం

టీమిండియా వన్డేలు ఆడడం మొదలుపెట్టిన తరువాత ఐదుగురు ప్లేయర్లు అరంగేట్రం చేయడం ఇది రెండవసారి. మొదటిసారి 1980 డిసెంబర్‌లో ఎంసీజీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో దిలీప్ దోషి, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, సందీప్ పాటిల్, తిరుమలై శ్రీనివాసన్ అరంగేట్రం చేశారు. ప్రస్తుత మ్యాచులో సంజు సామ్సన్, నితీష్ రానా, చేతన్ సకారియా, కె గౌతం, రాహుల్ చాహర్ శ్రీలంకతో మూడో వన్డేతో అరంగేట్రం చేశారు.

ఇండియా (ప్లేయింగ్ ఎలెవన్): పృథ్వీ షా, శిఖర్ ధావన్ (కెప్టెన), సంజు సామ్సన్ (కీపర్), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రానా, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహర్, నవదీప్ సైని, చేతన్ సకారియా

శ్రీలంక (ప్లేయింగ్ ఎలెవన్): అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (కీపర్), భానుకా రాజపక్సే, ధనంజయ డి సిల్వా, చరిత్ అసాలంకా, దసున్ షనక (కెప్టెన్), రమేష్ మెండిస్, చమికా కరుణరత్నే, అకిలా ధనంజయ, జ్యూమ్రావ్మా

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 23 Jul 2021 23:31 PM (IST)

  శ్రీలంక విజయం.. సిరీస్‌ భారత్‌ కైవసం.

  శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో వన్డేలో శ్రీలంక విజయం కైవసం చేసుకుంది. గత రెండు రెండు వన్డేల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన లంకీయులు మూడో వన్డేలో మాత్రం విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో వైట్‌ వాష్‌ నుంచి తప్పించుకున్నారు. ఇక భారత్‌ రెండు వన్డేలను గెలుచుకొని సిరీస్‌ను కైవసం చేసుకుంది.

 • 23 Jul 2021 23:28 PM (IST)

  విజయానికి చేరువవుతోన్న సమయంలో వరుస వికెట్లు..

  విజయానికి చేరువవుతోన్న సమయంలో శ్రీలంక వరుస వికెట్లను కోల్పోతోంది. తాజాగా చమికా కరుణరత్నే పెవిలయన్‌ బాట పట్టాడు. ప్రస్తుతం అకిలా ధనంజయ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం శ్రీలంక విజయానికి 7 పరుగుల దూరంలో ఉంది.

 • 23 Jul 2021 23:25 PM (IST)

  వెనుదిరిగిన ఫెర్నాండో..

  శ్రీలంక ఆరో వికెట్‌ కోల్పోయింది. రాహుల్‌ చాహర వేసిన బంతికి ఫెర్నాండో అవుట్ అయ్యాడు. 76 పరుగులతో మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పిన ఫెర్నాండో పృత్వీ షాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పడ్డాడు. వరుసగా రెండు వన్డేలో ఓడిపోయిన లంక జట్టు మూడో వన్డేలో మాత్రం సమిష్టి కృషితో రాణిస్తోంది.

 • 23 Jul 2021 23:17 PM (IST)

  దాదాపు ఖరారైన శ్రీలంక విజయం..

  తొలి రెండు వన్డేల్లో ఘోర ఓటమి పాలైన శ్రీలంక జట్టు మూడో వన్డేలో రాణించింది. భారత్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసి.. బ్యాటింగ్‌లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం శ్రీలంక విజయం దాదాపు ఖరారైపోయింది. శ్రీలంక విజయానికి 60 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీలంక స్కోర్ 37 ఓవర్లకుగాను ఆరు వికెట్లు కోల్పోయి 217 పరుగుల వద్ద కొనసాగుతోంది.

 • 23 Jul 2021 22:16 PM (IST)

  ఆటపై పట్టు సాధిస్తోన్న శ్రీలంక..

  మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లలో ఘోర పరాజయం చూసిన శ్రీంక మూడే వన్డేలో పట్టు సాధిస్తోంది. భారత్‌ను 225 పరుగుల స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన శ్రీలంక బ్యాటింగ్‌లోనూ రాణిస్తోంది. లంక బ్యాట్స్‌మెన్‌ నిలకడగా స్కోరు వేగాన్ని పెంచుతున్నారు. వర్షం కారణంగా కాసేపు ఆగిన మ్యాచ్‌ను 47 ఓవర్లకు పరిమితం చేశారు. ప్రస్తుతం శ్రీలంక విజయానికి 76 పరుగుల దూరంలో ఉంది. ఇక క్రీజులో అవిష్కా ఫెర్నాండో (60), ఛారిత్‌ అసలంకా (0) ఉన్నారు. 25 ఓవర్లు ముగిసే సమయానికి లంక స్కోర్‌ మూడు వికెట్ల నష్టానికి గాను 151 పరుగులుగా ఉంది.

 • 23 Jul 2021 21:51 PM (IST)

  20 ఓవర్లకు శ్రీలంక 127/1

  20 ఓవర్లకు శ్రీలంక ఒక వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. ఆవిష్క ఫెర్నాండో 55 పరుగులు భానుకా రాజపక్సే 50 పరుగులతో ఆడుతున్నారు. శ్రీలంక విజయానికి ఇంకా 100 పరుగులు అవసరం. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.

 • 23 Jul 2021 21:49 PM (IST)

  భానుకా రాజపక్స హాఫ్ సెంచరీ..

  శ్రీలంక మరో ఓపెనర్ భానుకా రాజపక్స హాఫ్ సెంచరీ చేశాడు. 42 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు.

 • 23 Jul 2021 21:37 PM (IST)

  ఆవిష్క ఫెర్నాండో హాఫ్ సెంచరీ.. 100 పరుగులు దాటిన లంక

  శ్రీలంక ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో హాఫ్ సెంచరీ సాధించాడు. 53 బంతుల్లో ఇందులో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. దీంతో లంక 1 వికెట్ నష్టపోయి 104 పరుగులు సాధించింది. విజయానికి ఇంకా 123 పరుగుల దూరంలో ఉంది.

 • 23 Jul 2021 21:27 PM (IST)

  15 ఓవర్లకు శ్రీలంక 92/1

  15 ఓవర్లకు శ్రీలంక 1 వికెట్ నష్టపోయి 92 పరుగులు సాధించింది. ఆవిష్క ఫెర్నాండో 46 పరుగులు భానుకా రాజపక్సే 28 పరుగులతో ఆడుతున్నారు. శ్రీలంక విజయానికి ఇంకా 135 పరుగులు అవసరం. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.

 • 23 Jul 2021 21:02 PM (IST)

  10 ఓవర్లకు శ్రీలంక 55/1

  10 ఓవర్లకు శ్రీలంక 1 వికెట్ నష్టపోయి 55 పరుగులు సాధించింది. ఆవిష్క ఫెర్నాండో 32 పరుగులు, భానుకా రాజపక్సే 9 పరుగులతో ఆడుతున్నారు. క్రిష్ణప్ప గౌతమ్‌కి ఒక వికెట్ దక్కింది.

 • 23 Jul 2021 20:48 PM (IST)

  మొదటి వికెట్ కోల్పోయిన శ్రీలంక

  శ్రీలంక మొదటి వికెట్ కోల్పోయింది. మినోద్ భానుకా 7 పరుగులు ఔటయ్యాడు. క్రిష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో చేతన్ సకారియా క్యాచ్ అందుకున్నాడు. దీంతో లంక 35 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. దీంతో భానుకా రాజపక్సే క్రీజులోకి వచ్చాడు. మరోవైపు ఆవిష్క ఫెర్నాండో ధాటిగా ఆడుతున్నాడు.

 • 23 Jul 2021 20:42 PM (IST)

  5 ఓవర్లకు శ్రీలంక స్కోరు 24/0

  లక్ష్య ఛేధనలో భాగంగా లంకేయులు వేగంగా ఆడుతున్నారు. 5 ఓవర్లకు వికెట్లేమి కోల్పోకుండా 25 పరుగులు సాధించారు. ఆవిష్క ఫెర్నాండో 16 పరుగులతో చెలరేగుతున్నాడు. మినోద్ నిలకడగా ఆడుతున్నాడు.

 • 23 Jul 2021 20:25 PM (IST)

  226 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక..

  శ్రీలంక 226 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. మొదటి ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. ఓపెనర్లుగా అవిష్క ఫెర్నాండో, మినోద్ బానుక వచ్చారు.

 • 23 Jul 2021 20:01 PM (IST)

  భారత్ 225 పరుగులకు ఆలౌట్..

  భారత్ 43.1 ఓవర్లో 225 పరుగులకు ఆలౌట్ అయింది. నవదీప్ సైని 15 పరుగులు ఔట్ అయ్యాడు. శ్రీలంక లక్ష్యం 226 పరుగులు..

 • 23 Jul 2021 19:57 PM (IST)

  తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్..

  భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 42.4 ఓవర్లకు తొమ్మిది వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. క్రీజులో చేతన్ సక్రియ వచ్చాడు. క్రీజులో నవదీప్ సైని 15 పరుగులు ఆట కొనసాగిస్తున్నాడు.

 • 23 Jul 2021 19:42 PM (IST)

  భారత్ 40 ఓవర్లకు 218/8

  భారత్ 40 ఓవర్లకు 8 వికెట్లు చేజార్చుకొని 218 పరుగులు చేసింది. క్రీజులో నవదీప్ శైనీ 11 పరుగులతో రాహుల్ చాహర్ 12 పరుగులతో ఆడుతున్నారు. ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉన్నాయ. రెండు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి. మరోవైపు లంక బౌలర్ అకిల ధనంజయ 3 వికెట్లు సాధించాడు.

 • 23 Jul 2021 19:26 PM (IST)

  200 పరుగులు దాటిన భారత్..

  భారత్ 200 పరుగులు దాటింది. 35 ఓవర్లకు 8వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. క్రీజులో నవదీప్ సైని 2 పరుగులు, రాహుల్ చాహర్ 3 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.

 • 23 Jul 2021 19:21 PM (IST)

  వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్..

  భారత్ వెంట వెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది. ధనంజయ వేసిన 32 ఓవర్లో మూడో బంతికి క్రుష్ణప్ప గౌతమ్ 2 పరుగులు ఎల్బీడబ్లుగా ఔటయ్యాడు. అనంతరు అదే ఓవర్లో ఐదో బంతికి నితీశ్ రాణా పేలవ షాట్ ఆడి మినోద్‌ కి చిక్కాడు. దీంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

 • 23 Jul 2021 19:13 PM (IST)

  ఆరో వికెట్ కోల్పోయిన భారత్

  భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ 40 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ధనంజయ వేసిన 31 ఓవర్‌ చివరి బంతికి ఎల్బీడబ్లు అయ్యాడు. క్రీజులో ప్రస్తుతం నితీశ్ రాణా, క్రుష్ణప్ప గౌతమ్ ఆడుతున్నారు.

 • 23 Jul 2021 19:03 PM (IST)

  భారత్ 30 ఓవర్లకు 187/5

  భారత్ 30 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు, నితీశ్‌ రానా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 • 23 Jul 2021 18:58 PM (IST)

  ఐదో వికెట్ కోల్పోయిన భారత్

  భారత్ 179 పరుగులు వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్య 19 పరుగులకే ఔటయ్యాడు. జయవిక్రమణ వేస్తున్న 28 ఓవర్ మూడో బంతికి ఎల్బీడబ్లుగా వెనుదిరిగాడు. దీంతో నితీశ్‌ రానా క్రీజులోకి వచ్చాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ 38 పరుగులు ఆట కొనసాగిస్తున్నాడు

 • 23 Jul 2021 18:41 PM (IST)

  భారత్ 25 ఓవర్లకు 162/4

  భారత్ 25 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడుతున్నాడు. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.

 • 23 Jul 2021 18:39 PM (IST)

  నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

  భారత్ 157 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మనీశ్ పాండే 11 పరుగులు ఔటయ్యాడు. దీంతో భారత్ కష్టాల్లో పడినట్లయింది. దీంతో హార్దిక్ పాండ్య క్రీజులోకి వచ్చాడు.

 • 23 Jul 2021 18:34 PM (IST)

  150 పరుగులు దాటిన భారత్..


  భారత్ 23.4 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 30 పరుగులు, మనీశ్ పాండే 10 పరుగులు ఆట కొనసాగిస్తున్నారు. 

 • 23 Jul 2021 18:23 PM (IST)

  6.30 గంటలకు మ్యాచ్ తిరిగి ప్రారంభం.. ఓవర్ల కుదింపు..

  భారత్‌, శ్రీలంక మధ్య మూడో వన్డే వర్షం అంతరాయంతో గంటసేపు ఆగిపోయింది. దీంతో తిరిగి సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. సుమారు గంటసేపు అంతరాయం కారణంగా ఓవర్లను కుదించారు. 3-3 ఓవర్లు తగ్గించారు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 47 ఓవర్లు మాత్రమే ఆడుతాయి.

 • 23 Jul 2021 17:29 PM (IST)

  తగ్గిన వర్షం

  భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో వర్షం కురవడం కాస్త తగ్గినట్లు సమాచారం. కానీ వికెట్లపై కవర్లు ఇంకా తీయలేదు. మరికొద్దిసేపట్లో మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ప్రకటన విడుదల కావల్సి ఉంది.

 • 23 Jul 2021 17:14 PM (IST)

  వర్షం కారణంగా నిలిచిన ఆట.. 23 ఓవర్లకు భారత్ 147/3

  శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు భారత్ గెలవగా ఈ రోజు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మూడే వన్డే జరగుతుంది. టాస్ గెలిచిన ఇండియా మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత్ 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, మనీశ్‌ పాండే ఉన్నారు. కాగా వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. అంతకు ముందు యువ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ 46 పరుగులు, ప్రుథ్వీషా 49 పరుగులు స్వల్ప తేడాతో అర్ధ సెంచరీలు చేజార్చుకున్నారు. లంక బౌలర్లలో చమీరా, జయ విక్రమ ఒక్కో వికెట్ తీశారు.

 • 23 Jul 2021 17:07 PM (IST)

  సూర్యకుమార్ యాదవ్‌కి లైఫ్..

  జయవిక్రమ వేసిన 22 ఓవరల్లో సూర్యకుమార్ యాదవ్‌కి లైఫ్ లభించింది. మొదటి బంతిని ఎదుర్కొనగానే జయవిక్రమ ఎల్బీగా అప్పీల్ చేశాడు. అంపైర్ కూడా ఔటిచ్చాడు. కానీ రివ్యూకు వెళ్లిన సూర్యకుమార్ అక్కడ నాటౌట్‌గా తేలాడు. దీంతో ఊపిరిపీల్చుకున్నాడు.

 • 23 Jul 2021 17:00 PM (IST)

  వర్షం కారణంగా నిలిచిన ఆట..

  వర్షం కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, మనీశ్‌ పాండే ఉన్నారు. భారత్ 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

 • 23 Jul 2021 16:58 PM (IST)

  23 ఓవర్లకు భారత్ 147 పరుగులు

  భారత్ 23 ఓవర్లకు 147/3 పరుగులు దాటింది. సూర్యకుమార్ యాదవ్ 22 పరుగులు ధాటిగా ఆడుతున్నాడు. మనీశ్ పాండే 10 పరుగులు ఆట కొనసాగిస్తున్నాడు. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతున్నారు. దీంతో పరుగుల వేగం తగ్గింది.

 • 23 Jul 2021 16:32 PM (IST)

  20 ఓవర్లకు భారత్ 130/3

  20 ఓవర్లకు భారత్ 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 5 పరుగులు, మనీశ్ పాండే 7 పరుగులు ఆట కొనసాగిస్తున్నారు.

 • 23 Jul 2021 16:27 PM (IST)

  మూడో వికెట్ కోల్పోయిన భారత్..

  భారత్ మూడో వికెట్ కోల్పోయింది. సంజు సామ్సన్ 46 పరుగులు ఔటయ్యాడు. దీంతో భారత్ 18 ఓవర్లలలో 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.

 • 23 Jul 2021 16:14 PM (IST)

  పృథ్వీ షా ఔట్(49)

  15.5 ఓవర్‌లో షనక బౌలింగ్‌లో పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. అర్థ సెంచరీ కోసం ఆడితూచి ఆడుతున్న షా ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. 15.5 ఓవర్లకు భారత్ స్కోర్ 102/2

 • 23 Jul 2021 15:44 PM (IST)

  8 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 59/1

  ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది. పృథ్వీ షా(28 పరుగులు, 29 బంతులు, 5 ఫోర్లు) దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డులో వేగం పెంచుతున్నాడు. మరోవైపు శాంమ్సన్ (12 పరుగులు, 14 బంతులు, 1ఫోర్ ) ఆడితూచి ఆడుతున్నాడు.

 • 23 Jul 2021 15:34 PM (IST)

  కొత్త కుర్రాళ్లకు స్వాగతం.. టోపీలు అందించిన సీనియర్లు

  టీమిండియా వన్డే జట్టులోకి అరంగేట్రం చేసిన ఐదుగురు ఆటగాళ్లు.. సంజు సామ్సన్, నితీష్ రానా, చేతన్ సకారియా, కె గౌతం, రాహుల్ చాహర్ లకు టీమిండియా సీనియర్లు టోపీలు అందజేసి, సాదరంగా ఆహ్వానం పలికారు. ఈమేరకు బీసీసీఐ ట్విట్టర్లో వీడియోను షేర్ చేసింది.

 • 23 Jul 2021 15:28 PM (IST)

  5 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 40/1

  ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. ధావన్ 13 పరుగులు చేసి చమీరా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. పృథ్వీ షా 17, శాంమ్సన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 • 23 Jul 2021 15:21 PM (IST)

  తొలి వికెట్ కోల్పోయిన భారత్; ధావన్ (13) ఔట్

  చమీరా బౌలింగ్‌లో భారీ షాట్ కోసం ప్రయత్నించిన ధావన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. మూడు ఓవర్లు ముగిసే సరికి టీం స్కోర్ 29/1

 • 23 Jul 2021 14:55 PM (IST)

  శ్రీలంక టీంలో మూడు మార్పులు

  శ్రీలంక టీంలో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రవీణ్ జయవిక్రమ, అకిలా ధనంజయ, రమేష్ మెండిస్ టీంలో చోటుదక్కించుకున్నారు.

 • 23 Jul 2021 14:51 PM (IST)

  ఐదుగురు అరంగేట్రం

  టీమిండియా వన్డేలు ఆడడం మొదలుపెట్టిన తరువాత ఐదుగురు ప్లేయర్లు అరంగేట్రం చేయడం ఇది రెండవసారి. మొదటిసారి 1980 డిసెంబర్‌లో ఎంసీజీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో దిలీప్ దోషి, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, సందీప్ పాటిల్, తిరుమలై శ్రీనివాసన్ అరంగేట్రం చేశారు. ప్రస్తుత మ్యాచులో సంజు సామ్సన్, నితీష్ రానా, చేతన్ సకారియా, కె గౌతం, రాహుల్ చాహర్ శ్రీలంకతో మూడో వన్డేతో అరంగేట్రం చేశారు.

 • 23 Jul 2021 14:13 PM (IST)

  బౌలర్ ప్రసిద్ద్ కృష్ణతో స్పెషల్ ఇంటర్వ్యూ

Click on your DTH Provider to Add TV9 Telugu