AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL 3rd ODI: తడబడ్డ భారత బ్యాట్స్‌మెన్‌.. చెలరేగిన లంక బౌలర్లు.. మూడో వన్డేలో శ్రీలంక విజయం.

IND vs SL 3rd ODI: శ్రీలంకతో మూడు వన్డేలో సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంక ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు వన్డేల్లో రాణించిన భారత ప్లేయర్స్‌ మూడో వన్డేలో మాత్రం...

IND vs SL 3rd ODI: తడబడ్డ భారత బ్యాట్స్‌మెన్‌.. చెలరేగిన లంక బౌలర్లు.. మూడో వన్డేలో శ్రీలంక విజయం.
Srilanka Won 3rd Odi
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 23, 2021 | 11:58 PM

IND vs SL 3rd ODI: శ్రీలంకతో మూడు వన్డేలో సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంక ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు వన్డేల్లో రాణించిన భారత ప్లేయర్స్‌ మూడో వన్డేలో మాత్రం తడబడ్డారు. ముఖ్యంగా భారత బ్యాట్స్‌మెన్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. టీమిండియా 43.1 ఓవర్‌లలో 225 పరుగులకే పరిమితమైంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లంకీయులు మొదటి నుంచి దూకుడుగానే ఆడారు. మ్యాచ్‌ ముగిసే సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ చివరికి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే మూడు వన్డేలా సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుంది.

టీమిండియా నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మూడు వికెట్ల తేడాతో చేధించింది. శ్రీలంక జట్టులో ఫెర్నాండో (76), భానుక రాజపక్స (65) పరుగులతో శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వికెట్‌కు వీరందించిన 109 పరుగుల భాగస్వామ్యం కీలకంగా మారింది. ఇక అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 29 పరుగుల వద్దే శిఖర్‌ ధావన్‌ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్, పృథ్వీషా కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. కానీ శ్రీలంక బౌలర్లు చెలరేగిపోవడంతో టీమిండియా వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా 49 పరుగుల వద్ద, శాంసన్‌ 46 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. ఇలా వీరిద్దరూ స్వల్ప పరుగుల వ్యవధిలో హాఫ్‌ సెంచరీని కోల్పోయారు. అనంతరం వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి గంట తర్వాత 47 ఓవర్లకు కుదించి మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించారు. అయితే లంక బౌలర్ల దాటికి టీమిండియా 43.1 ఓవర్లో 225 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్ అకిల ధనంజయ, జయవిక్రమ 3 వికెట్లు సాధించారు.

Also Read: Olympics 2021 Opening Ceremony Highlights: విశ్వ క్రీడా మహోత్సవం ప్రారంభం.. భారత అథ్లెట్లకు చప్పట్లతో వెల్‌కం చెప్పిన ప్రధాని మోడీ

Tokyo Olympics 2021 Live: పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ భారత ప్లేయర్స్ పేలవ ప్రదర్శన..

Virat Kohli – Sachin: ‘సచిన్ రికార్డును టీమిండియా కెప్టెన్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడు’