AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli – Sachin: ‘సచిన్ రికార్డును టీమిండియా కెప్టెన్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడు’

ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉందనని షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. రాబోయే ఐదేళ్లలో కోహ్లీ మరో 30 సెంచరీలు సాధిస్తాడని అక్తర్ అంచనా వేశాడు.

Virat Kohli - Sachin: 'సచిన్ రికార్డును టీమిండియా కెప్టెన్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడు'
Virat Kohli- Sachin
Venkata Chari
|

Updated on: Jul 23, 2021 | 8:39 PM

Share

Virat Kohli- Sachin: రాబోయే ఐదేళ్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన రికార్డును ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడని పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అభిప్రాయపడ్డాడు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ, 70 అంతర్జాతీయ సెంచరీలతో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా రాణిస్తోన్న విరాట్.. కచ్చితంగా సచిన్ రికార్డును దాటేస్తాడనే ధీమా వ్యక్తం చేశాడు. అలాగే విరాట్, బాబర్ ఆజంల మధ్య పోలికపై మాట్లాడుతూ, ఇద్దరి ఆటగాళ్ల మధ్య చాలా పోలికలు ఉన్నాయని తెలిపాడు. బాబర్ ఆజం తన ఆటతో నిరంతరం ముందుకు సాగుతున్నాడని, ఈ తరంలో అత్యంత గొప్ప బ్యాట్స్ మెన్లలో బాబర్ ఖచ్చితంగా ఉంటాడని పేర్కొన్నాడు. కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ లతో పాటు టాప్ 5లో కచ్చితంగా ఉంటాడని షోయబ్ అన్నారు.

ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. రాబోయే ఐదేళ్లలో కోహ్లీ మరో 30 సెంచరీలు సాధిస్తాడని చెప్పుకొచ్చాడు. కోహ్లీ తన కెరీర్‌లో 110 అంతర్జాతీయ సెంచరీలు చేస్తాడని ఆయన అన్నారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడని పేర్కొన్నాడు. 100 అంతర్జాతీయ సెంచరీలు చేసిన సచిన్.. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన సంగతి తెలిసిందే.

వచ్చే ఐదేళ్లలో కోహ్లీ సెంచరీల మోత మోగిస్తాడు.. స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ అక్తర్ ఇలా అన్నాడు.. “అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు సరైనవే. కానీ,వచ్చే ఐదేళ్లలో మరో 30 సెంచరీలు చేసే సత్తా విరాట్‌లో ఉందని, 120 లేదా కనీసం 110 సెంచరీలు సాధించాలని నేను కోరుకుంటున్నాను” అని వెల్లడించారు. బాబర్ కోహ్లీ కంటే ఏడు సంవత్సరాల చిన్నవాడు. 2015 లో బాబర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంటరయ్యాడు.

బాబర్ పాకిస్తాన్ గొప్ప బ్యాట్స్ మెన్ కావొచ్చు.. కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టడానికి, పాకిస్తాన్ కెప్టెన్ రాబోయే కొన్నేళ్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ తరపున ఇప్పటివరకు ఆడిన గొప్ప బ్యాట్స్‌మన్‌లలో బాబర్ ఒకడిగా ఎదగగలడని అక్తర్ అభిప్రాయపడ్డాడు. అయితే కోహ్లీ కంటే గొప్పవాడు అవుతాడా లేదా అనేది 10 సంవత్సరాల తరువాత మాత్రమే తెలుస్తుందని అన్నాడు. “బాబర్ విరాట్‌ను అధిగమించాల్సిన అవసరం ఉంటే, అతను కోహ్లీలా గొప్ప ఇన్నింగ్స్‌లను ఎన్నో ఆడి, భారీగా పరుగులు సాధించాల్సి ఉంటుంది. బాబర్ అజామ్ పాకిస్తాన్ గొప్ప బ్యాట్స్ మెన్లలో ఒకడు అనడంలో ఎటువంటి సందేహం లేదని, కానీ, దీనికి సమయం పడుతుందని’ షోయబ్ అన్నారు.

Also Read:

IND vs SL 3rd ODI : శ్రీలంక లక్ష్యం 226 పరుగులు.. ఫెయిలైన మిడిలార్డర్.. రాణించిన పృథ్వీషా, సంజు శాంసన్‌..

Olympics 2021 Opening Ceremony Live: విశ్వ క్రీడా మహోత్సవం ప్రారంభం.. భారత అథ్లెట్లకు చప్పట్లతో వెల్‌కం చెప్పిన ప్రధాని మోడీ