IND vs SL 3rd ODI : శ్రీలంక లక్ష్యం 226 పరుగులు.. ఫెయిలైన మిడిలార్డర్.. రాణించిన పృథ్వీషా, సంజు శాంసన్..
IND vs SL 3rd ODI : శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు భారత్ గెలవగా మూడే వన్డే ఈ రోజు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది.
IND vs SL 3rd ODI : శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు భారత్ గెలవగా మూడే వన్డే ఈ రోజు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబట్టుకోవాలని శ్రీలకం భావిస్తోంది. అయితే ఈసారి టాస్ గెలిచిన ఇండియా మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా కెప్టెన్ శిఖర్ ధావన్, పృథ్వీషా బరిలోకి దిగారు. మొదటి ఓవర్ నుంచే ధాటిగా ఆడిన శిఖర్ ధావన్ చమీర బౌలింగ్‌లో మినోద్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 29 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
తర్వాత సంజు శాంసన్, ప్రుధ్వీషా ఇద్దరు కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో పృథ్వీషా.. దసున్ శనక బౌలింగ్‌లో 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీగా ఔటయ్యాడు. తర్వాత 19 ఓవర్‌లో సంజు శాంసన్ 46 పరుగులు కూడా ఔటయ్యాడు. స్వల్ప పరుగుల తేడాతో ఇద్దరు అర్ధ సెంచరీలు చేజార్చుకున్నారు. ఈ క్రమంలో భారత్ 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. గంట తర్వాత మ్యాచ్‌ని 47 ఓవర్లకు కుదించారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వెంటనే మనీశ్ 158 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. 184 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడుతూ..40 పరుగుల వద్ద ఎల్బీ గా ఔటయ్యాడు. ఆ తర్వాత ధనుంజయ వేసిన 33 ఓవర్‌లో భారత్ రెండు వికెట్లు వెనువెంటనే కోల్పోయింది. దీంతో 195 పరుగులకు 8 వికెట్లు చేజార్చుకుంది. చివరలో టెయిలెండర్లు మరో 30 పరుగులు జోడించి 43.1 ఓవర్లో 225 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో శ్రీలంక లక్ష్యం 226 పరుగులుగా నిర్ణయించారు. లంక బౌలర్ అకిల ధనంజయ, జయవిక్రమ 3 వికెట్లు సాధించారు.
INNINGS BREAK: #TeamIndia post 2⃣2⃣5⃣ on the board. #SLvIND@PrithviShaw 4⃣9⃣ @IamSanjuSamson 4⃣6⃣
3/44 for Akila Dananjaya
Sri Lanka’s chase to begin shortly.
*Following rain interruption, the revised target for Sri Lanka is 227.
Scorecard ? https://t.co/7LRDbx0DLM pic.twitter.com/S3QJquk9BQ
— BCCI (@BCCI) July 23, 2021