Viral Video: చిన్నారి సైకిల్‌పై కూర్చున్న భారీకాయం.. ఆతరువాత ఏం జరిగిందో తెలుసా?
పిల్లలు సరదాగా ఆరుబయట ఆడుకోవడం మనం చూస్తునే ఉంటాం. పెద్దలు కూడా వారికి సాయంగా ఆటలు ఆడిస్తుంటారు. ఈ వీడియోలో భారీకాయమున్న బాలుడు చేసిన పనికి కచ్చితంగా నవ్వాల్సిందే.

Viral Video: పిల్లలు సరదాగా ఆరుబయట ఆడుకోవడం మనం చూస్తునే ఉంటాం. పెద్దలు కూడా వారికి సాయంగా ఆటలు ఆడిస్తుంటారు. అయితే, ఈవీడియోలో మాత్రం ఓ చిన్నారి సైకిల్‌తో ఆటలాడిన ఓ భారీకాయమున్న బాలుడు మిమ్మల్ని కచ్చితంగా నవ్విస్తాడనడంలో ఎలాంటి సందేహంలేదు. వివరాల్లోకి వెళ్తే.. ఓ చిన్నారి తన సైకిల్‌తో ఆరుబయట ఆడుకోవడానికి వస్తుంది. ఇంతలో ఓ బాలుడు చిన్నారి నుంచి సైకిల్‌ను తీసుకుని తను తొక్కేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, ఆ బాలుడు భారీకాయంతో ఉండడంతో.. అతని బరువు ఆపలేక సైకిల్ విరిగిపోతుంది. బాలుడు కిందపడిపోతాడు.
ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనికి నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. నీ శరీరాన్ని చూసి సైకిల్‌పై కూర్చోవాల్సింది అంటూ ఒకరు కామెంట్ చేయగా, నీ మొండితనం కారణంగా పాపం చిన్నారి సైకిల్ విరిగిపోయిందంటూ మరొకరు కామెంట్ చేశారు. ఈవీడియో ఇన్‌స్టాంట్ రిగ్రెట్ అనే యూజర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. 15,000 వ్యూస్‌తో ఈవీడియో నెట్టింట్లో దూసుకపోతోంది. ఐదువందలకు పైగా షేర్లు, వందకు పైగా రీట్వీట్లతో ఈవీడియో దూసుకపోతోంది.
— Instant Regret (@lnstant_regret_) July 19, 2021
Also Read:
Viral Video: రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!
Viral News: ఈ బుజ్జి ఏనుగు తెలివి అదుర్స్.. ఆకట్టుకుంటున్న వీడియో.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
