AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఈ బుజ్జి ఏనుగు తెలివి అదుర్స్.. ఆకట్టుకుంటున్న వీడియో.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఏనుగులు.. జంతువులలోనే పెద్దది. భారీ ఆకారం ఉన్న ఏనుగు నిజానికి ఎక్కువ భయం కలవి. కానీ వీటికి అపారమైన తెలివి తేటలు ఉంటాయి.

Viral News: ఈ బుజ్జి ఏనుగు తెలివి అదుర్స్.. ఆకట్టుకుంటున్న వీడియో.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Elephant Video
Rajitha Chanti
|

Updated on: Jul 23, 2021 | 11:44 AM

Share

ఏనుగులు.. జంతువులలోనే పెద్దది. భారీ ఆకారం ఉన్న ఏనుగు నిజానికి ఎక్కువ భయం కలవి. కానీ వీటికి అపారమైన తెలివి తేటలు ఉంటాయి. జ్ఞాపకశక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఇక చిన్న ఏనుగు పిల్లలు చేసే అల్లరి మాములుగా ఉండదు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇవి చాలా స్మార్ట్‏గా బిహేవ్ చేస్తాయి. మనుషుల నుంచి కొన్ని పనులను సులభంగా నేర్చుకుంటాయి. ప్రస్తుతం ఓ గున్న ఏనుగుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అందులో ఓ గున్న ఏనుగు.. మొక్కజొన్న పొత్తును తీసుకుని.. తన తొండతో తొక్కలు తీసి మరి తినేస్తుంది. పక్కన తల్లి ఏనుగు కానీ.. మవాటి వారు లేకపోయినా.. అదేం పట్టనట్లుగా ప్రశాంతంగా.. మొక్కజొన్న పొత్తులను ఆరగించే పనిలో ఆ గున్న ఏనుగు నిమగ్నమైంది. ఆ బుజ్జి ఏనుగు .. చుట్టు ఉన్న ప్రపంచాన్ని సైతం మర్చిపోయి.. తినడంలో తెగ బిజీ అయ్యింది. అక్కడే ఉన్న కొందరు ఏనుగు తినడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఏనుగు మొక్కజొన్న పొత్తును ఎంజాయ్ చేస్తూ తినడం చూసిన నెటిజన్లను ఆకట్టుకుంటుంది. గున్న ఏనుగుకు ఎన్ని తెలివితేటలు అనే ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరోకరు.. దానికి తొక్క ఎలా తీయాలో తెలుసు.. తర్వాత కాల్చి ఇవ్వమని అడుగుతుంది అంటూ కామెంట్స్ చేశారు.

ట్వీట్..

Also Read: Shilpa Shetty: భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి ఇన్‏స్టాలో పోస్ట్ చేసిన శిల్పా శెట్టి.. ఏమన్నదంటే..

Karthika Deepam Latest: ఎమోషనల్ ట్విస్ట్..మూడంకెలు లెక్కపెట్టిన మోనిత.. కార్తీక్ ను అసహ్యించుకుంటున్న తండ్రి..సర్ది చేప్పే ప్రయత్నంలో వంటలక్క!

Sonam Kapoor: ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు అలా ఫుల్‌స్టాప్ పెట్టిన టాప్ హీరోయిన్.. అసలు విషయం ఇదే అంటూ..

Rakul Preet Singh: హెల్ప్ చేయాలంటూ రకుల్ ఆర్తనాదాలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..