AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty: భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి ఇన్‏స్టాలో పోస్ట్ చేసిన శిల్పా శెట్టి.. ఏమన్నదంటే..

అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త.. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

Shilpa Shetty: భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి ఇన్‏స్టాలో పోస్ట్ చేసిన శిల్పా శెట్టి.. ఏమన్నదంటే..
Shilpa Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 23, 2021 | 9:01 AM

అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త.. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తన భర్త అరెస్ట్ అయిన తర్వాత శిల్పా శెట్టి మీడియా అదృశ్యమయ్యారు. ఈ కేసు గురించి కానీ.. తన భర్త గురించి కానీ శిల్పా శెట్టి ఇంతవరకు స్పందించలేదు. అయితే తాజాగా ఆమె జడ్జ్‏గా వ్యవహరిస్తున్న డ్యాన్స్ రియాల్టీ షో నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే… గురువారం రాత్రి.. ఆమె తన ఇన్‏స్టా స్టోరీలో ఒక పుస్తకం ఫోటోను షేర్ చేసింది.

మమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులపై.. మేము అనుభవించిన చిరాకు.. దురదృష్టం పై మేము తిరిగి కోపాన్ని చూస్తాము. మేము మా ఉద్యోగాలను కోల్పోవచ్చు. లేదా వ్యాధి బారిన పడవచ్చు. లేదా ప్రియమైన వ్యక్తి మరణాన్ని చూడవచ్చనే భయంతో ఉంటున్నాము. మనందరం ఉండవలసిన స్థలం ఇదే. ప్రస్తుతం ఏం జరిగిందో.. ఏదైన కావచ్చు అని ఆత్రుతగా చూడడం లేదు.. కానీ జరుగుతున్నది పూర్తిగా తెలుసు. నేను ఇంకా బ్రతికి ఉన్నది అదృష్టం. నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాను. గతంలో సవాళ్లను తట్టుకున్నాను. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను తట్టుకుంటాను. ఈరోజు నా జీవితాన్ని గడపడానికి ఏదీ నన్ను మర్చాల్సిన అవసరం లేదు అంటూ పోస్ట్ చేసింది.

Shilpa

Shilpa

ఇక శిల్పాశెట్టి పోస్ట్ చూస్తుంటే.. ప్రస్తుతం మానసిక స్థితి ఎలా ఉందనేది తెలియజేసింది. తన భర్త విషయంలో తన వైఖరి గురించి ఆమె మాట్లాడకపోయినా, జీవితంలో సవాళ్లను స్వీకరించడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఆమె తన భర్తకు మద్దతుగా నిలబడుతుందా లేదా అతనికి వ్యతిరేకంగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు.

Also Read: Nayanthara: ఓటీటీలోకి లేడీ సూపర్ స్టార్ నయన్ సినిమా.. డిస్నీ హాట్‌స్టార్‌లో ‘నెట్రిక్కన్’..

Karthika Deepam Latest: ఎమోషనల్ ట్విస్ట్..మూడంకెలు లెక్కపెట్టిన మోనిత.. కార్తీక్ ను అసహ్యించుకుంటున్న తండ్రి..సర్ది చేప్పే ప్రయత్నంలో వంటలక్క!