Viral Video: అప్పటివరకు ఆ గుర్రం బానే ఉంది.. మతాబులు పేల్చగానే చిర్రెత్తిపోయింది.. ఆపై వరుడికి చుక్కలు

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Jul 23, 2021 | 3:34 PM

పెళ్లి కొడుకును గుర్రం మీద ఊరేగించే సాంప్రదాయాన్ని మనదేశంలో చాలాచోట్ల పాటిస్తారు. అయితే, ఒక్కోసారి ఆ గుర్రాలు బెదిరిపోయి నానా బీభత్సం....

Viral Video: అప్పటివరకు ఆ గుర్రం బానే ఉంది.. మతాబులు పేల్చగానే చిర్రెత్తిపోయింది.. ఆపై వరుడికి చుక్కలు
Wedding Funny Video

పెళ్లి కొడుకును గుర్రం మీద ఊరేగించే సాంప్రదాయాన్ని మనదేశంలో చాలాచోట్ల పాటిస్తారు. అయితే, ఒక్కోసారి ఆ గుర్రాలు బెదిరిపోయి నానా బీభత్సం సృష్టిస్తాయి. అలాంటి ఘటనలు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా రాజస్థాన్‌లో ఓ గుర్రం వరుడితో సహా పరుగులు తీసింది. దీంతో అతడిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు బంధుమిత్రలకు తల ప్రాణం తోకకు వచ్చింది. ఆ గుర్రం సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు వరుడిని తీసుకెళ్లిపోయింది. అజ్మెర్‌లోని రాంపురా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటివరకు బాగానే ఉన్న గుర్రం..  బాణాసంచా పేల్చడంతో బెదిరిపోయింది. అక్కడి నుంచి పరగులు తీసింది. దాని ట్రైనర్ గుర్రాన్ని ఆపేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు. అలా గుర్రం సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం లగెత్తింది. వరుడి బంధువులు బైకులు, కార్లలో ఆ గుర్రాన్ని వెంబడించారు. చివరికి వరుడిని సేఫ్‌గా పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో వరుడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

వీడియో వీక్షించండి…

 

 వధువు ఊరేగింపు.. ఇంతలో ఊహించని ప్రమాదం

కొద్ది నెలల క్రితం యూపీలో  ఓ వధువు ఓపెన్ సన్ రూఫ్ కారులో ఊరేగుతూ పెళ్లి మండపానికి బయల్దేరింది. ఆమె కారు వెంటే బంధుమిత్రులు కూడా ఎంతో జోష్‌తో ముందుకు సాగుతున్నారు. వారి ఊరేగింపు వీధుల్లో నుంచి హైవే మీదకు చేరుకుంది. వధువును కూడా ఉత్సాహపరిచారు. ఆమె కూడా సన్ రూఫ్‌లో నిలబడి డ్యాన్స్ చేస్తుంటే.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ మార్గంలో వేగంగా వస్తున్న కారు ఒకటి అదుపుతప్పి.. ఊరేగింపులో పాల్గొన్న అతిథులను, బంధువులను ఢీకొట్టింది. ఆ కారు వేగానికి జనాలు గాల్లోకి ఎగిరిమరీ కిందపడ్డారు. అయితే, ఆ వాహనం.. వధువు ప్రయాణిస్తున్న కారు పక్క నుంచే వెళ్లిపోయింది. దీంతో అప్పటివరకు పెళ్లి కూతురు కారు పక్కన నిలబడి డ్యాన్స్ చేస్తున్న బంధువులు కూడా ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వీడియో దిగువన చూడండి…

Also Read:కరోనా బాధిత భర్త వీర్యం కోసం పిటిషన్ వేసిన మహిళ ఇంట విషాదం

క్యూట్ స్మైల్‌‌‌‌తో కట్టిపడేస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

 

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu