Coronavirus: కరోనా బాధిత భర్త వీర్యం కోసం పిటిషన్ వేసిన మహిళ ఇంట విషాదం
కరోనా బాధిత భర్త వీర్యం కోసం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన మహిళ ఇంట విషాదం నెలకుంది. కోర్టు ఆదేశాలతో వీర్యం సేకరించిన....
కరోనా బాధిత భర్త వీర్యం కోసం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన మహిళ ఇంట విషాదం నెలకుంది. కోర్టు ఆదేశాలతో వీర్యం సేకరించిన ఒక్కరోజు తర్వాత.. ఆమె భర్త తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సదరు మహిళ తరఫు న్యాయవాది నీలాయ్ పటేల్ శుక్రవారం వెల్లడించారు ఈ కేసుపై తదుపరి విచారణకు కొద్ది గంటల ముందే ఈ ఘటన జరిగింది.
కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవి…
వడోదరాలోని స్టెర్లింగ్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న తన భర్త నుంచి సేకరించిన వీర్యం ద్వారా ఐవీఎఫ్ విధానంలో తల్లి కావాలని ఓ మహిళ కోరుకుంది. అయితే.. అందుకు డాక్టర్లు నో చెప్పారు. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటే తాము వీర్యాన్ని సేకరిస్తామని చెప్పారు. దీంతో గుజరాత్ హైకోర్టులో ఆ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం.. సదరు కరోనా బాధితుని నుంచి వీర్యాన్ని తక్షణమే సేకరించాలని ఆస్పత్రిని నిర్దేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దాన్ని తగిన విధంగా స్టోర్ చేయాలని సూచించింది. కోర్టు ఆదేశించిన తర్వాత మంగళవారమే ఆ వ్యక్తి వీర్యాన్ని డాక్టర్లు సేకరించారని స్టెర్లింగ్ ఆస్పత్రి జోనల్ డైరెక్టర్ అనిల్ నంబియార్ బుధవారం తెలిపారు. కోర్టు అనుమతి ఇస్తే.. ఐవీఎఫ్ విధానం కోసం దాన్ని వినియోగిస్తామని వెల్లడించారు. కాగా ఎమర్జెన్సీ వార్డులో కరోనాతో చికిత్స పొందుతున్న భర్త నుంచి వీర్యం కోసం సదరు మహిళ కోర్టుకు వెళ్లడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read:గుడిలో కుడికాలు పెట్టలేదని నవవధువు చెంప చెళ్ళుమనిపించిన ఆడపడుచు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?