గుడిలో కుడికాలు పెట్టలేదని నవవధువు చెంప చెళ్ళుమనిపించిన ఆడపడుచు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Telugu Crime News: మూడు ముళ్ళ బంధంతో పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన ఆమెకు తొలి రోజు నుంచే అత్తారింటి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం నిత్యం నరకం చూపించినా..
మూడు ముళ్ళ బంధంతో ఎన్నో ఆశలతో పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన ఆమెకు తొలి రోజు నుంచే అత్తారింటి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం నిత్యం నరకం చూపించినా.. తన వివాహ జీవితం పెటాకులు కాకూడదని ఆ బాధను పంటికింద బిగబట్టి భరించింది. కొన్ని రోజులు గడిస్తే అంతా సర్దుకుంటుందని ఆశించింది. అయితే అత్తారింటి వేధింపులు తగ్గకపోగా.. రోజురోజుకూ మరింత మితమీరుతుండటంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. అదనపు కట్నం కోసం ఆ మహిళను మానసిక, శారీరక వేధింపులకు గురిచేసిన అత్తారింటి వారిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. అత్తారింటి వేధింపుల గురించి మహారాష్ట్రలోని నిగ్డికి చెందిన ఆ మహిళ(27) తెలిపిన వివరాలు పోలీసులనే విస్తుపోయేలా చేసింది.
2020 డిసెంబరులో పెళ్లి సమయంలోనే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. పెళ్లి సమయంలో అత్తింటి వారు పట్టుబడటంతో ఇతర కట్న కానుకలతో పాటు రూ.1 లక్ష నగదు, 20 తులాల బంగారం అదనంగా ఇచ్చుకున్నారు. అయినా అత్తింటి వారు సంతృప్తి చెందలేదు. పెళ్లి జరిగిన మరుసటి రోజు నవ దంపతులు తమ ఇంటికి సమీపంలో ఆలయంలో దైవదర్శనం కోసం వెళ్లారు. నవ వధువు పొరబాటున తన ఎడమ కాలును ముందు పెట్టి ఆలయంలోకి ప్రవేశించింది. అశుభకరమంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆడపడుచు.. నవ వధువని కూడా చూడకుండా అందరి ముందే ఆమె చెంపపై కొట్టింది. అతిథులు, ఆలయంలోని ఇతర భక్తుల సమక్షంలోనే తనను అలా అవమానించారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు వెల్లడించింది.
ఆ తర్వాత కూడా అత్తింటి వారు నిత్యం ఆమెను అదనపు కట్నం కోసం వేధించారు. మరింత డబ్బు తీసుకురాకుంటే పుట్టింటికి పంపేస్తామని బెదిరించారు. తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి గురించి తెలిసిన ఆమె..అదనపు కట్నం తీసుకొచ్చేందుకు నిరాకరించడంతో నిత్యం మానసికంగా, శారీరకంగా ఆమెను హింసించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమె భర్త, ఆడపడుచు, అత్తపై పోలీసులు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు.
Also Read..
పురిటి నొప్పులతో మహిళ అవస్థలు.. అది గమనించిన యువకులు ఏం చేశారంటే..
పూల వనంగా మారనున్న తిరుమల కొండలు.. ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనాలు.. టీటీడీ మరో కీలక నిర్ణయం..!