AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెగాసస్ పై సుప్రీంకోర్టు విచారణకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్.. తిరస్కరించిన ప్రభుత్వం

పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టుచేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తన సొంత ఫోన్ కూడా ట్యాపింగ్ కి గురైందని, తాను ప్రతిపక్ష నేతనని, ప్రజావాణిని వినిపించాల్సి ఉందని ఆయన అన్నారు.

పెగాసస్ పై సుప్రీంకోర్టు విచారణకు కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీ డిమాండ్.. తిరస్కరించిన ప్రభుత్వం
Rahul Gandhi
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 23, 2021 | 3:20 PM

Share

పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టుచేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తన సొంత ఫోన్ కూడా ట్యాపింగ్ కి గురైందని, తాను ప్రతిపక్ష నేతనని, ప్రజావాణిని వినిపించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇది ప్రజావాణిపై దాడేనని ఆరోపించిన అయన హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కోరారు. ప్రధాని మోదీఫై కూడా సుప్రీంకోర్టు విచారణ అవసరమేనని వ్యాఖ్యానించారు., ఇండియా పైన, ఈ దేశ సంస్థలపైన ఈ స్పై వేర్ ని ప్రధాని, హోమ్ మంత్రి ప్రయోగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది దేశ ద్రోహం కిందికే వస్తుందన్నారు. ఇజ్రాయెల్ టెర్రరిస్టులపై ఓ ఆయుధంగా వాడేందుకు దీన్ని( పెగాసస్ ను) ఉపయోగిస్తుంటే మన దేశంలో దీన్ని ఇండియన్స్ పైన, ఇక్కడి సంస్థలపైనా ఆయుధంగా వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తానేమీ భయపడడం లేదని, అవినీతిపరులు, దొంగలు మాత్రమే భయపడుతారని ఆయన వ్యాఖ్యానించారు. పెగాసస్ పై విచారణకు భయమెందుకని ప్రశ్నించారు. ముఖ్యంగా కర్ణాటకలో ఈ ‘ఆయుధాన్నీ’ ప్రయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు .

అయితే రాహుల్ గాంధీ డిమాండును ప్రభుత్వం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు విచారణ అవసరం లేదని, , రాజకీయంగా విఫలమైన వారు దీన్ని ఓ సమస్యగా చూపుతున్నారని, అసలు ఇది సమస్యే కాదని హోమ్ శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ అన్నారు. ఈ విషయాన్నీ ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసిందన్నారు.. కాగా పార్లమెంటులో ఈ అంశాన్ని మళ్ళీ విపక్ష సభ్యులు ప్రస్తావించారు. గత మూడు రోజులుగా ఈ వివాదం ఉభయ సభలనూ కుదిపివేస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: KTR : ‘గిఫ్ట్ ఎ స్మైల్’ పంపిణీ వాయిదా, ‘నా బర్త్‌డే వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావొద్దు’ : కేటీఆర్

Sandeep Kishan : సందీప్ కిషన్ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సరికొత్త రికార్డ్..! యూట్యూబ్‌లో 40 మిలియన్లకు పైగా వ్యూస్‌..