ఆస్ట్రేలియాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు..సిడ్నీలో ‘నేషనల్ ఎమర్జెన్సీ’.. దేశ ప్రజలకు ప్రధాని స్కాట్ మారిసన్ క్షమాపణ..

ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇందుకు తాను చింతిస్తున్నానని ప్రధాని స్కాట్ మారిసన్ అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడం పట్ల ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పారు.

ఆస్ట్రేలియాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు..సిడ్నీలో 'నేషనల్ ఎమర్జెన్సీ'.. దేశ ప్రజలకు ప్రధాని స్కాట్ మారిసన్ క్షమాపణ..
Scott Morrison
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 23, 2021 | 4:51 PM

ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇందుకు తాను చింతిస్తున్నానని ప్రధాని స్కాట్ మారిసన్ అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడం పట్ల ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పారు. నిన్న దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. కోవిడ్ పై పోరులో మనం మన టార్గెట్లను చేరుకోలేకపోయామన్నారు. వ్యాక్సినేషన్ చురుకుగా సాగకపోవడానిని తాను బాధ్యత తీసుకుంటున్నానని, దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు కూడా బాధ్యత తనదేనని ఆయన చెప్పారు. అయితే రానున్న రోజుల్లో ఈ పరిస్థితిని అధిగమించగలమని ఆశిస్తున్నానన్నారు. కొన్ని విషయాలు మన అదుపులో ఉంటాయని, మరికొన్ని ఉండవని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఇండియాలో కోవిడ్ కేసులు ఉధృతంగా ఉన్న సమయంలో ఇండియా నుంచి వచ్చే విమాన ప్రయాణికులపైన, విమాన సర్వీసులపైన పలు ఆంక్షలు పెట్టిన మారిసన్ ఇప్పుడు బేలగా మాట్లాడుతున్నాడు. ఇలా ఉండగా కొత్త కేసులతో అతి పెద్ద నగరమైన సిడ్నీ అల్లాడుతోంది. నెల రోజుల పాటు లాక్ డౌన్ విధించినప్పటికీ డెల్టా వేరియంట్ ఔట్ బ్రేక్ ని నివారించలేకపోయామని న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ గ్లేడిస్ అంగీకరించారు.

తమకు అత్యవసరంగా మరిన్ని వ్యాక్సిన్లు, ఇతర వనరులు కావాలని క్యాన్ బెర్రాను కోరుతున్నామన్నారు. నిన్న ఒక్క రోజే 136 కొత్త కేసులు నమోదైనట్టు ఆమె చెప్పారు. నగరంలో ప్రతి చోటా వైరస్ వ్యాపించిందని,25 మిలియన్ల జనాభాలో సగమంది ఇంకా లాక్ డౌన్ ఆంక్షల పరిధిలోనే ఉన్నారన్నారు. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు సుమారు 12 శాతం మంది ప్రజలు మాత్రమే టీకామందు తీసుకున్నారు. తగిననంత ఫైజర్ వ్యాక్సిన్ సరఫరా కాకపోవడం..ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పై అనుమానాలు తలెత్తడం కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగడానికి కారణమవుతున్నాయని అంటున్నారు. సిడ్నీలో సుమారు 50 లక్షల జనాభా ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Samantha: నా ఫేవరెట్‌ ఆలీగారు ఈ సినిమాతో పెద్ద సక్సెస్‌ కొడతారు: సమంత అక్కినేని

రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ ఈ నెల 27 వరకు పొడిగింపు.. పోలీసుల అభ్యర్థనకు ఓకే చెప్పిన కోర్టు