Road accident : నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్ దగ్గర కొంచెం సేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై వేగంగా..
Road accident – Nagarkurnool : నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్ దగ్గర కొంచెం సేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై వేగంగా ఎదురెదురుగా వస్తోన్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. రోడ్డు ప్రమాద తీవ్రతకు రెండు కార్లు నుజ్జునజ్జయ్యాయి.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కార్లలో చిక్కున్న మృతదేహాలను స్థానికుల సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని డీఎస్పీ నరిసింహులు తెలిపారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు.
బాధితులు హైదరాబాద్ కు చెందిన సుచిత్ర, ఆనంద్ బాగ్ కు చెందిన వారుగా తెలుస్తోంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో అచ్చంపేట హాస్పిటల్ కి తరలించారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
ఈ ఘోర రోడ్డు ప్రమాదం పై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్ చేసి, సంఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. తక్షణమే క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించి వైద్య సేవలందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Read also: Chilakavari Palli : అర్థరాత్రి వేళ భీకర శబ్దాలతో ఉలిక్కిపడుతోన్న పల్లె.. దినదిన గండంగా బ్రతుకులు