Chilakavari Palli : అర్థరాత్రి వేళ భీకర శబ్దాలతో ఉలిక్కిపడుతోన్న పల్లె.. దినదిన గండంగా బ్రతుకులు
ఊరంతా గాఢనిద్రలో ఉంది. ఒక్కసారిగా భారీ శబ్ధాలు. పల్లెజనాలను ఉలిక్కిపడేలా చేసింది. కాసేపు నిశబ్ధం.. మళ్లీ ప్రకంపనలు..ఏం జరిగిందో తెలియని పరిస్థితి...
Horrible Noises – Chilakavari Palli – Earthquake : ఊరంతా గాఢనిద్రలో ఉంది. ఒక్కసారిగా భారీ శబ్దాలు. పల్లెజనాలను ఉలిక్కిపడేలా చేసింది. కాసేపు నిశబ్ధం.. మళ్లీ ప్రకంపనలు..ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఊరి ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేసింది. అది భూతమా…? భూ ప్రకంపమా తెలియక జనం భయంతో వణికిపోతున్నారు. ఇంతకీ ఆ పల్లెలో ఏం జరిగింది..? కట్ చేస్తే.. అది చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చిలకవారిపల్లె గ్రామం. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో రాత్రిపూట భారీ శబ్ధాలు వస్తున్నాయి. దాంతో ఏం జరుగుతుందో తెలియక జనం భయాందోళనకు గురవుతున్నారు.
తాజాగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో సిలిండర్ పేలినట్లుగా శబ్ధాలు రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. కొందరి ఇంట్లోని వస్తువులు కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. భయంతో ఇళ్లు వదిలి అంతా రోడ్ల మీదకి వచ్చారు. కాసేపు అందరూ రకరకాలుగా చర్చించుకున్నారు. శబ్ధాలు రాకపోవడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లి నిద్రపోయారు. మళ్లీ తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో భారీ శబ్ధాలు వచ్చాయి. దాంతో ఊరిజనమంతా బయటకు వచ్చేశారు. ఏదో దుష్టశక్తి వచ్చిందని ఒకరు…కాదు కాదు దెయ్యం గ్రామాన్ని పట్టి పీడిస్తోందని మరొకరు చెప్పుకోసాగారు.
ఈలోపు కొందరు భూ ప్రకంపనలు వచ్చి ఇదంతా జరుగుతుందని గ్రహించి.. జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారంతా గ్రామానికి చేరుకొని శబ్దాలు వచ్చిన ప్రాంతంలో పరిశీలిస్తున్నారు. భూమి లోపలి పొరలలో కదలిక వల్లే శబ్ధాలు వస్తున్నాయని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే గ్రామస్తులు మాత్రం ఏదో జరుగు తోందని చర్చించుకుంటున్నారు. భూ ప్రకంపనలు అయితే సిలిండర్లు పేలిన స్థాయిలో ఎందుకు శబ్దాలు వస్తాయని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు చిత్తూరుజిల్లా పడమటి ప్రాంతంలో తరచూ భూమి కంపిస్తోందని అధికారులు చెబుతున్నారు. రాత్రిపూట ఈ శబ్దాలు భారీ స్థాయిలో వస్తాయని.. వాటికి భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఒక్క చిలకవారిపల్లెనే కాదు.. పుంగనూరు మండలంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా శబ్ధాలు వస్తున్నాయని చెబుతున్నారు.
Read also : Vizag Steel : విశాఖ ఉక్కు సంఘాల నేతలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రితో విజయసాయి రెడ్డి భేటీ.. హైలైట్స్