Vizag Steel : విశాఖ ఉక్కు సంఘాల నేతలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రితో విజయసాయి రెడ్డి భేటీ.. హైలైట్స్

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి..

Vizag Steel : విశాఖ ఉక్కు సంఘాల నేతలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రితో విజయసాయి రెడ్డి భేటీ.. హైలైట్స్
Vijayasai Reddy
Follow us

|

Updated on: Jul 23, 2021 | 7:15 PM

Vijayasai Reddy – Vizag Steel – Nirmala Sitharaman : విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఆయన ఆర్థిక మంత్రితో భేటీ జరిపారు.

“అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరింది. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిది. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌పై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ కారణంగానే విశాఖపట్నం నగరం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోంది” అని విజయసాయి రెడ్డి  కేంద్రమంత్రికి వివరించారు.

ఇటీవల దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్జిజన్‌ను రైళ్ళ ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో ఉత్పతి అయ్యే స్టీల్‌ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుందని ఎంపీ పేర్కొన్నారు.

అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని విజయసాయి చెప్పుకొచ్చారు. కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఏటా 300 కోట్ల రూపాయలను అదనంగా భరించాల్సి వస్తోందన్నారు.

ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుందని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని ఆర్థిక మంత్రికి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

Nirmala Sitharaman Vijayasa

Nirmala Sitharaman Vijayasa

Read also : Dasoju Sravan : ‘అది చాలా దుర్మార్గం..’ ఇచ్చిన హామీలపై ఇక న్యాయపరమైన పోరాటం : దాశోజు శ్రవణ్

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..