Pyramids of Giza: మహిళ ముఖం, సింహం శరీరం.. ఆ పిరమిడ్‌లో అన్నీ మిస్టరీలే.. గ్రహాంతవాసులున్నారని నమ్మకం.

Gija Ka Pyramid: అతిపురాతన నాగరికతకు పేరుగాంచింది ఈజిప్టు.. ఇక్కడ పిరమిడ్స్ , మమ్మీల తో పాటు ఎన్నో రహస్య ప్రదేశాలకు కూడా కేరాఫ్ అడ్రస్ ఈజిప్టు . అయితే ఇక్కడ..

Pyramids of Giza: మహిళ ముఖం, సింహం శరీరం.. ఆ పిరమిడ్‌లో అన్నీ మిస్టరీలే.. గ్రహాంతవాసులున్నారని నమ్మకం.
Gija Ka Pyramid
Follow us
Surya Kala

|

Updated on: Jul 23, 2021 | 8:17 PM

Gija Ka Pyramid: అతిపురాతన నాగరికతకు పేరుగాంచింది ఈజిప్టు.. ఇక్కడ పిరమిడ్స్ , మమ్మీల తో పాటు ఎన్నో రహస్య ప్రదేశాలకు కూడా కేరాఫ్ అడ్రస్ ఈజిప్టు . అయితే ఇక్కడ మమ్మీలే కాదు.. ఆల్ గిజాలోని ఎడారిలో ఉన్న ఓ రాతి సింహం కూడా ఎంతో ప్రసిద్ధి. గిజా సింహిక ఇది కొండరాతితో చెక్కిన విగ్రహం. ఇప్పటికీ సైన్స్ చేధించని మిస్టరీ ప్లేస్ ల్లో ఒకటి ఈ సింహిక. ఒక ఏకశిలా రాతితో చెక్కబడిన ఒక విగ్రహం ముఖం ఓ మహిళ ముఖంగా శరీరం సింహంలా చెక్కబడిన ఈ విగ్రహాన్ని గిజా సింహిక అని అంటారు. గిజాలో ఉన్న సింహికకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈజిప్ట్ జాతీయ చిహ్నంగా పూర్వ వైభవం చాటి చెప్పేలా గొప్ప నిర్మాణ కట్టడాలలో ఒకటిగా ఖ్యాతిగాంచింది గిజా సింహిక. ఇప్పటీకే ఈ విగ్రహం మిస్టరీనే పురాతన శాస్త్రజ్ఞులకు సవాల్ విసుతూనే ఉంది.

ఈ సింహిక విగ్రహం గురించి నిర్మాణం గురించి భిన్నవదనాలున్నాయి. ఈ విగ్రహాన్ని దాదాపు ఏడు వేల నుంచి పదివేల సంవత్సరాల క్రితం చెక్కారని కొందరు, 4,500 సంవత్సరాలు చెక్కారని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే ఈ సింహిక తో పాటు ఎడారిలో నిర్మించిన అనేక నిర్మలు కాలగర్భంలో కలిసిపోయాయి. అనేక కట్టడాలు, నిర్మాణాలు దాదాపు పూర్తిగా శీలమైపోయాయి. అయినప్పటికీ సింహిక విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ విగ్రహం చాలా ఏళ్ళు ఇసుకతో కప్పబడి ఉంది. అందుకనే ఈ విగ్రహం సేఫ్ గా ఉందని కొంతమంది వాదిస్తారు.

17వ శతాబ్దంలో ఈ విగ్రహం కాళ్ల కింద రెండు గదులు ఉన్నట్టు పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అయితే ఆ గదులను తెరవడానికి ఎటువంటి వీలు లేకుండా ఉంది. అయితే తాము ఎలాగైనా ఆ గదులు ఓపెన్ చేయాలనీ భావించిన శాస్త్రజ్ఞులకు అక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. అందుకనే ఈ గదులు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఆ గదుల మీద రీసెర్చ్‌‌ చేయడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్‌‌ ఇవ్వడంలేదు. అయితే… అందులో గ్రహాంతర వాసులు ఉన్నారని, అతీంద్రియ శక్తులు ఉన్నాయని చాలామంది నమ్ముతున్నారు. ఇప్పటికే గిజా పిరమిడ్‌‌ని తెరవాలనుకున్న వాళ్లు శపించబడ్డారని ప్రచారంలో ఉంది. అందుకే దీన్ని తెరవకపోవడమే స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ గ్రేట్ పిరమిడ్ సింహికను జపనీస్ పురాతన తత్వవేత్త పలు అధ్యయనం చేశారు

Also Read: Heros Restaurants: ఓ వైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ తో బిజిబిజీ ఈ హీరోలు