Heros Restaurants: ఓ వైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ తో బిజిబిజీ ఈ హీరోలు

Heros Restaurants: ప్రపంచంలో ఏ బిజినెస్ లో నైనా నష్టపోవచ్చునేమో కానీ.. నాణ్యత.. రుచికరమైన ఆహారపదార్ధాలను వినియోగదారులకు అందిస్తే నష్టపోని వ్యాపారం ఒకటి..

Heros Restaurants: ఓ వైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ తో బిజిబిజీ ఈ హీరోలు
Heros Hotels
Follow us
Surya Kala

|

Updated on: Jul 23, 2021 | 7:46 PM

Heros Restaurants: ప్రపంచంలో ఏ బిజినెస్ లో నైనా నష్టపోవచ్చునేమో కానీ.. నాణ్యత.. రుచికరమైన ఆహారపదార్ధాలను వినియోగదారులకు అందిస్తే నష్టపోని వ్యాపారం ఒకటి ఉంది. అదే అందరికీ ఆకలి తీర్చే రెస్టారెంట్. ఈ రంగంలో తెలుగు హీరోలు అడుగు పెట్టారు. వివిధరకాలుగా ఆహారపదార్ధాలను రుచికరంగా అందిస్తూ.. నగరవాసులను అలరిస్తున్నారు. తెలుగు హీరోలు హోటల్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం..

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున కు కూడా ఒక విలాసవంతమైన రెస్టారెంట్ ఉంది. ఎన్ గ్రిల్ ఎంతో అందమైన ఈ రెస్టారెంట్ లో మనం వంటి సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయి. మనం సినిమాలో నాగార్జున సమంతకు పాఠాలు చెప్పే సీన్ ఈ హోటల్ లోనిదే.. ఈ హోటల్ లో రకరకాల ఆహార పదార్ధాలు భోజన ప్రియులను ఆకర్షిస్తాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రూవరీ కాన్సెప్ట్ తో ప్రారంభించిన పబ్ 800 జుబి. హైదరాబాద్ లోని నగరవాసులకు వీకెండ్స్ లో సరదాగా గడపాలని అనుకునేవారికి బెస్ట్ అప్షన్ గా నిలుస్తుంది. ఇక్కడ డ్రింక్స్ తో పాటు.. అనేక రకాల ఆహారాలను కూడా అందిస్తున్నారు.

మరోయంగ్ చాక్లెట్ బాయ్ శర్వానంద్ కు కాఫీ షాప్ ఉంది. బెంజ్ కాఫీ షాప్ కు శర్వానంద్ యజమాని. ఈ కాఫీ షాప్ కు వెదురుతో చేసిన ఇంటీరియర్ డిజన్స్ మట్టిగోడలు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాదు ఈ కాఫీ షాప్ తెలుగువారి గ్రామీణ వాతావరణాన్ని ప్రతిభించేలా ఉంటుంది. ఇక్కడ తెలుగువారి స్నాక్స్ అరటికాయ బజ్జీ, పునుగులు, మిర్చి బజ్జీ బాగా ప్రసిద్ధి చెందాయి.

యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా అచ్చమైన తెలుగు రుచులను ప్రతిబించించేలా హైదరాబాద్ నగరంలో ఒక రెస్టారెంట్ ను ప్రారంభించారు., పేరు కూడా వివాహభోజనంబు అంటూ ఆహారప్రియులను ఆకర్షించేలా పెట్టారు. ఈ రెస్టారెంట్ లో తెలంగాణ, రాయలసీమ రుచులతో పాటు హైదరాబాద్ బిర్యానీ కూడా ఫేమస్, ఇక్కడ నాన్ వెజ్ థాలీ స్పెషల్ ని టాక్.

జై సినిమాతో హీరోగా వెండి తెరపై అడుగు పెట్టిన నవదీప్ గౌతమ్ ఎస్ససీ , చందమామ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆరిస్టుగా నటిస్తున్న సందీప్ కి గచ్చిబౌలి లో బీపీఎం అనే ఒక పబ్ ఉంది. ఇక్కడ రకరకాల విదేశీ ఫుడ్ లభిస్తుంది. రుచికరమైన స్టార్టర్స్ కూడా ఉంటాయి.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దక్షణాది వంటలతో ఉలవచారు ప్రాంఛైజీని తీసుకున్నారు. నిజానికి సురేందర్ రెడ్డి కూడా ఒక రెస్టారెంట్ ను ప్రారంభించాలని అనుకున్నాడు. కానీ రిస్క్ లేని బిజినెస్ అంటూ మళ్ళీ ఉలవచారు ప్రాంఛైజీని తీసుకున్నారు.

ఐతే సినిమాతో పరిచయమైన శశాంక్ కూడా ఒక రెస్టారెంట్ కు యాజమాని. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫేమస్ సినిమా మాయాబజార్ థీమ్ తో మయా బజార్ రెస్టారెంట్ ను ప్రారంభించాడు. రెస్టారెంట్ లో మాయాబజార్ పోస్టర్లు కనిపిస్తూ.. ఫ్యామిలీస్ ని ఆకర్షిస్తుంటాయి. ఇక్కడ మొఘలాయి ఫుడ్ కు ఫేమస్ .

Also Read:   డాక్టర్‌బాబు యాక్షన్‌కు చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా అభిమానే.. కొడుకులా చూస్తారంటున్న కార్తీక్‌బాబు