ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా కోసం రంగంలోకి బిగ్ బి.. ఈ నెల 24నుంచి షూటింగ్‌‌‌లో జాయిన్ అవ్వనున్న అమితాబ్

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ సినిమాలను కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణడైరెక్షన్ లో రాధేశ్యామ్ అనే పిరియాడికల్ లవ్ డ్రామాలో...

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా కోసం రంగంలోకి బిగ్ బి.. ఈ నెల 24నుంచి షూటింగ్‌‌‌లో జాయిన్ అవ్వనున్న అమితాబ్
Prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ సినిమాలను కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ డైరెక్షన్ లో రాధేశ్యామ్ అనే పిరియాడికల్ లవ్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో డార్లింగ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు రెబల్ స్టార్. సలార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్న సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది. ఈ సినిమా మాఫియా బ్యాడ్రాప్ లో ఉండనుందని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ తో ఆదిపురుష్ అనే సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని టాక్. వీటితోపాటు మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ తో ఓ భారీ సినిమా చేయనున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్.

వైజంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల 24 నుంచి హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్ లో బడాబడా స్టార్స్ నటించనున్నారు.  హీరోయిన్ గా దీపికాపదుకొనే నటిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రేపటి నుంచి అమితాబ్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారని సమాచారం. త్వరలోనే ప్రభాస్ కూడా ఈ సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమా ఉండబోతుందని మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం భారీ సెట్స్ కూడా వేయించనున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించనున్నాడన్నది ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోన్న వార్త.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Video : దీపికా పదుకొనే పాటను దింపేసిన తల్లీకూతురు.. ఫిదా చేస్తున్న వీడియో..

Heros Restaurants: ఓ వైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ తో బిజిబిజీ ఈ హీరోలు

Venkatesh: మిమ్మల్ని మీరే మించిపోయారు.. ఎమోషనల్ అయిన వెంకటేష్ డాటర్..

Click on your DTH Provider to Add TV9 Telugu