Krithi Shetty: లెక్క తేలింది.. ‘బేబమ్మ’ కిట్టీలో ప్రస్తుతం ఉన్న సినిమాలు ఇవే…

నా సినిమా లైనప్‌ మీద ఎవరికి తోచినట్టు వాళ్లు రాస్తున్నారు.. అవన్నీ బూటకం.. ఇప్పుడు నా చేతిలో మూడే సినిమాలున్నాయి.. ఇది నిజం నిజం...

Krithi Shetty: లెక్క తేలింది.. 'బేబమ్మ' కిట్టీలో ప్రస్తుతం ఉన్న సినిమాలు ఇవే...
Krithi Shetty
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 23, 2021 | 9:40 PM

నా సినిమా లైనప్‌ మీద ఎవరికి తోచినట్టు వాళ్లు రాస్తున్నారు.. అవన్నీ బూటకం.. ఇప్పుడు నా చేతిలో మూడే సినిమాలున్నాయి.. ఇది నిజం.. నిజం.. నిజం అంటూ రెండునెలల కిందటే ఒట్టేసి చెప్పారు ఉప్పెన ఫేమ్ క్రితి శెట్టి. ఈ రెండు నెలల్లో ఆమె కెరీర్‌ గ్రాఫ్‌లో వేరేమీ ఛేంజెస్ రాలేదా.. అంటే.. అబ్బో చాలానే వచ్చాయ్ అంటున్నారు సినీ జనాలు. టాలీవుడ్‌లో షేర్‌ వ్యాల్యూ కొద్దికొద్దిగా పెంచుకుంటూ వెళుతున్నారు లేటెస్ట్ సెన్సేషన్ క్రితి శెట్టి. వైష్ణవ్‌ డెబ్యూ మూవీగా బ్లాక్‌బస్టర్ సౌండ్ ఇచ్చిన ఉప్పెన… హీరోయిన్ క్రితి కెరీర్‌ని ఇంకా స్పీడ్‌గా డ్రైవ్ చేసింది. నేచురల్ స్టార్‌ నానితో చేస్తున్న శ్యామ్‌సింగరాయ్ క్రితికి దక్కిన వెరీ నెక్స్ట్‌ ఎలివేషన్‌. తర్వాత సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి చేస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ క్రితి కిట్టీలో పడ్డ సోలో ఛాన్స్‌. కట్‌చేస్తే.. ఇస్మార్ట్ హీరో క్యాంప్‌నుంచి కాల్ రావడంతో.. బేబమ్మకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారు అనే టాక్ మొదలైంది.

లింగుసామి డైరెక్ట్ చేస్తున్న మల్టిలింగువల్‌ మూవీ క్రితిని సౌత్‌ గ్లామర్‌ ఇండస్ట్రీలన్నిట్లోనూ ఇంట్రడ్యూస్ చేసే ఛాన్సుంది. అంతకంటే ముందే… టాలీవుడ్‌లో కూడా క్రితి దూకుడు మామూలుగా లేదు. అక్కినేని కాంపౌండ్ కూడా ఈ కొత్తమ్మాయి మీదే కాన్సన్‌ట్రేట్ చేస్తోంది. సోగ్గాడే చిన్నినాయనేకు సీక్వెల్‌గా వస్తున్న బంగార్రాజులో చైతూకి జోడీగా క్రితి ఫిక్సయ్యారట. చాక్లెట్ బాయ్‌ నితిన్‌ సైతం.. ఉప్పెన బ్యూటీ వైపే చూస్తున్నారు. శేఖర్ అనే డెబ్యూ డైరెక్టర్ నితిన్‌తో చేస్తున్న కొత్త మూవీలో ఫిమేల్‌ లీడ్‌గా క్రితిశెట్టి పేరు ఖరారైందట. నియర్ ఫ్యూచర్‌లో యంగ్ హీరోలందరి సరసనా కనిపించబోతున్నారు బేబమ్మ. ఈవిధంగా సైలెంట్ గా టోటల్ టాలీవుడ్‌ని చుట్టేస్తున్నారు ఈ కన్నడ సెన్సేషన్.

Also Read: సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్‌ను మంత్రి గౌతమ్ రెడ్డితో కలిసి ప్రారంభించిన దివ్యంగురాలు నాగలక్ష్మి

తన ఖరీదైన కొత్త కారుతో ముందుగా మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లి సందడి చేసిన ఎన్టీఆర్..

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!