AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR-Ram Charan: తన ఖరీదైన కొత్త కారుతో ముందుగా మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లి సందడి చేసిన ఎన్టీఆర్..

Jr.NTR-Ram Charan: హీరోలు ఎప్పుడు స్నేహితులుగానే ఉంటారు.. ఇతర హీరోల గురించి తక్కువగా మాట్లాడం, చెడుగా చెప్పడం వంటివి చేయరు.. ఏదైనా ప్రకృతి విపరీత్యాలు సంభవిస్తే..

Jr.NTR-Ram Charan: తన ఖరీదైన కొత్త కారుతో ముందుగా మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లి సందడి చేసిన ఎన్టీఆర్..
Ntr New Car
Surya Kala
|

Updated on: Jul 23, 2021 | 8:41 PM

Share

Jr.NTR-Ram Charan: హీరోలు ఎప్పుడు స్నేహితులుగానే ఉంటారు.. ఇతర హీరోల గురించి తక్కువగా మాట్లాడం, చెడుగా చెప్పడం వంటివి చేయరు.. ఏదైనా ప్రకృతి విపరీత్యాలు సంభవిస్తే..అందరూ కలిసి ప్రజలను ఆదుకోవడానికి ముందుకొస్తారు.. అయితే ఆ హీరోల అభిమానులు మాత్రం తమ హీరో గొప్ప అంటే.. తమ హీరో గొప్ప అంటూ.. కొట్టుకున్న సందర్భాలున్నాయి.. అయితే యంగ్ హీరోల జనరేషన్ వచ్చే సరికి చాలా మార్పు వచ్చింది అని చెప్పవచ్చు.. రామ్ చరణ్ మహేష్ బాబు, మహేష్ బాబు ఎన్టీఆర్ , ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇలా అందరూ ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా స్నేహితుల్లా కలిసి మెలసి ఉంటారు..

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్ ల మధ్య ఉన్న రిలేషన్ ను మరింత ధృడంగా చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ. ఇద్దరూ సెట్స్ మీదనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా స్నేహితుల్లా ఉంటున్నారనే సంగతి పలు సందర్భాల్లో వెల్లడైంది. ఎన్టీఆర్ పుట్టిన రోజుకు రామ్ చరణ్ సతీ సమేతంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మరీ సెలబ్రేట్ చేశాడు. ఇక తారక్ కూడా రామ్ చరణ్ తో క్లోజ్ గా ఉంటున్నాడు.. తాజాగా ఎన్టీఆర్ తన కొత్తకారుతో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పార్క్ చేసి ఉన్న ఆ కారు ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తారక్ తన కొత్త కారు వేసుకుని రామ్ చరణ్ వద్దకు వెళ్ళాడట.. అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాడట.

లాంబొర్కిని యూరస్ కారుని ఎన్టీఆర్ కొన్ని నెలల క్రితం బుక్ చేశాడు. అత్యంత ఖరీదైన ఈ కారు ఇటీవలే డెలివరీ అయ్యింది. సుమారు రూ. 5 కోట్ల కు పైగా ఖరీదు చేసే ఈ కారు కోసం తారక్ ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికి ఎన్టీఆర్ కల నెరవేరింది, కారు తన దగ్గరకు వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కార్లు బైక్స్ అంటే చాలా ఇష్టం. లగ్జరీ ఫీచర్స్‌తో పాటు సేఫ్టీగా ఉండే వాహనాలను కొనుగోలు చేస్తాడు అన్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ పూర్తి కావొచ్చిన నేపథ్యంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.

Also Read:  మహిళ ముఖం, సింహం శరీరం.. ఆ పిరమిడ్‌లో అన్నీ మిస్టరీలే.. గ్రహాంతవాసులున్నారని నమ్మకం.