Guru Purnami: గురు పౌర్ణమి వేడుకలకు సిద్ధమైన రామకృష్ణ మఠం.. ఈ ఏడాది విద్యార్థులతో ప్రత్యక కార్యక్రమాలు..
Ramakrishna Math: హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి రోజున (ఈ నెల 24) హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఉదయం 7 గంటలకు..
ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ అంటారు. అంతే కాదు ‘వ్యాస పౌర్ణమి’ అని అంటారు. ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షిని పూజించేవారి గురు కృప లభిస్తుందని నమ్మకం. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి భారతీయులకు ఉంది. ”గు” అంటే అంధకారం/ చీకటి అని అర్థం. ”రు” అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానాంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అదే ఈ ఆదునిక కాలంలో ఉపాధ్యాయులను ప్రత్యేకంగా గౌరవించడం వంటి కార్యక్రమాలను చేస్తుంటారు.
ఇందులో భాగంగా ప్రతి ఏటా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి రోజున (ఈ నెల 24) హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఉదయం 7 గంటలకు విశేష పూజ, ఉదయం 8 గంటలకు భజనలు, ఉదయం 10:45కు హోమం, 11:15కు తెలుగులో ప్రసంగం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఉదయం 11:40కి ముండకోపనిషత్తు నూతన పుస్తక ఆవిష్కరణతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12:05 నిమిషాలకు విశేష హారతి, సాయంత్రం 6:45కు ఆరాత్రికం ఉంటాయి. రాత్రి 7:15 నిమిషాలకు ప్రత్యేక భజనలుంటాయి.
అంతే కాదు మఠంలోని పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ ఉంటుంది. కొన్ని పుస్తకాలపై 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. విద్యార్థుల ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రామకృష్ణ మఠం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు గురు పౌర్ణమి వేడుకలకు మఠంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అయితే కోవిడ్ వ్యాప్తి కారణంగా గత ఏడాది నుంచి కొద్ది మందితో నిర్వహిస్తున్నారు. కానీ ఏడాది మాత్రం ఘనంగా నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది.