Traffic Advisory: ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి.. శంషాబాద్ వెళ్లే సర్వీస్ రోడ్డు మూసివేత.. వివరాలివే

మరో సూచన చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. తమ ట్విట్టర్ వేదికగా దారి మళ్లింపు ప్రకటన చేశారు. హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో..

Traffic Advisory: ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి.. శంషాబాద్ వెళ్లే సర్వీస్ రోడ్డు మూసివేత.. వివరాలివే
Traffic Advisory
Follow us

|

Updated on: Jul 23, 2021 | 10:39 PM

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలకు అక్కడక్కడా రహదారులు జలమయమవుతాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అయితే రోడ్లపై కొద్దిసేపు మాత్రమే వరద నీరు నిలుస్తుంది. ఆ సమయంలో బల్దియా, ట్రాఫిక్‌ పోలీసులు వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. కాసేపటికే నీరంతా వెళ్లిపోతుంది. అందుకే వర్షం పడి తగ్గిన వెంటనే బయటకు వెళ్లకుండా.. కాస్త ఆగి వస్తే… ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉత్పన్నం కావని సూచిస్తుంటారు ట్రాఫిక్ అధికారులు. అయితే తాజాగా  సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విట్టర్ వేదికగా దారి మళ్లింపు ప్రకటన చేశారు. హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో హిమాయత్ సాగర్ నుండి శంషాబాద్ వెళ్లే సర్వీస్ రోడ్డు మూసివేయడం జరిగిందని తెలిపారు. కావున ఆ రోడ్డులో వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.

భాగ్యనగర జంట జలాశయాలు నీటితో తొణికిసలాడుతున్నాయి. ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్‌లకు భారీగా వరద వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు.. వరద నీటి ప్రవాహంతో హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. గరిష్ఠ స్థాయికి హిమాయత్ సాగర్ నీరు చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

ఉస్మాన్ సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలమండలి అధికారులు ఇప్పటికే రెండు గేట్లు ఎత్తి.. 180 క్యూసెక్కుల వ‌ర‌ద నీటిని మూసి నది లోకి విడుదల చేశారు. ఇవాళ మూడు గేట్లు ఎత్తి రెండు అడుగుల మేర నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోవడంతో గండిపేట జలాశయం పరివాహక ప్రాంతంలో హై అలెర్ట్ ప్రకటించారు. చాదరఘాట్, హైదర్ షా కోర్ట్, ముసారం బాగ్ ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి: