Oneplus Hyderabad: ఇకపై హైదరాబాద్ నుంచే దేశ మంతటికీ వన్‌ప్లస్ టీవీలు.. ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్..
Oneplus Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్‌లో హైదరాబాద్ కేంద్రంగా తమ సేవలను అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి...
Oneplus Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్‌లో హైదరాబాద్ కేంద్రంగా తమ సేవలను అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ వచ్చి చేరింది. ఇక భారత దేశ వ్యాప్తంగా అవసరమయ్యే స్మార్ట్ టీవీలన్నీ హైదరాబాద్ కేంద్రంగా తయారుకానున్నాయి. నగరానికి చెందిన రేడియంట్ అనే ఎలక్ట్రానిక్స్ సంస్థ పలు కంపెనీలకు చెందిన టీవీలను రూపొందిస్తుంటుంది. ఈ సంస్థే ఇప్పటి వరకు వన్‌ప్లస్ టీవీలను రూపొందిస్తోంది. అయితే ఇప్పటి వరకు వన్‌ప్లస్ టీవీల తయారీకి అవసరమయ్యే మడి సరుకులను దిగుమతి చేసుకునే వారు. కానీ తాజాగా వన్‌ప్లస్ తీసుకున్న నిర్ణయంతో ఇకపై భారత్‌లో వన్‌ప్లస్ టీవీల తయారీకి భాగ్య నగరం హబ్‌గా మారనుంది.
ఈ విషయమై రేడియంట్ ఎండీ రమిందర్ సింగ్ సొని మాట్లాడుతూ.. ‘వన్‌ప్లస్ సంస్థతో కలిసి మేము 2020 నుంచి పనిచేస్తున్నాము. గడిచిన మూడు నెలల్లో మేము 5 లక్షల టీవీలను తయారు చేశాం. ఈ సంఖ్యను డిసెంబర్ నాటికి 10 లక్షలకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని’ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని మహేశ్వరం ఫ్యాబ్ సిటీలో ఉన్న ఈ కంపెనీ ఇప్పటికే సామ్‌సంగ్, షియోమీ వంటి బ్రాండ్‌లకు చెందిన టీవీలను తయారు చేస్తోంది.
హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్..
వన్‌ప్లస్ టీవీల తయారీకి హైదరాబాద్ హబ్‌గా మారడం పట్ల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్హం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రజలతో పంచుకున్న మంత్రి.. వన్‌ప్లస్ తీసుకున్న నిర్ణయం సంతోషదాయం అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులను కొనసాగిస్తున్నందుకు వన్‌ప్లస్ సంస్థ సీఈఓ పెటెలావ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Would like to share the happy news that @oneplus has made Hyderabad a hub to make smart TVs in India
My gratitude to Founder & CEO @PeteLau for continuing to invest in Hyderabad ? pic.twitter.com/U1hr9Ah7dA
— KTR (@KTRTRS) July 23, 2021