SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక.. ఆన్‌లైన్‌ సేవలకు కాసేపు అంతరాయం. ఎప్పడి నుంచి ఎప్పటి వరకంటే..

SBI Alert: తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే క్రమంలో బ్యాంక్‌లు సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను ఉపయోగించుకునే వారికి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు గాను...

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక.. ఆన్‌లైన్‌ సేవలకు కాసేపు అంతరాయం. ఎప్పడి నుంచి ఎప్పటి వరకంటే..
Sbi
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 23, 2021 | 11:13 PM

SBI Alert: తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే క్రమంలో బ్యాంక్‌లు సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను ఉపయోగించుకునే వారికి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు గాను అప్పుడప్పుడు బ్యాంకింగ్ సంస్థలు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే ఇలాంటి మెయింటెనెన్స్‌ యాక్టివిటీలు చేసే క్రమంలో సేవల్లో అంతరాయం ఏర్పడుతుంటుంది. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కూడా తమ వినియోగాదారులకు ఇదే విషయాన్ని తెలియజేసింది. కాసేపటి క్రితమే ట్విట్టర్‌ వేదికగా ఎస్‌బీఐ ఈ ప్రకటన చేసింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకునే వారికి మెరుగైన సేవలను అందించే క్రమంలోనే సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం వేకువ జామున 03:00 గంటల నుంచి 03:45 గంటల వరకు అంటే సుమారు 45 నిమిషాలపాటు సేవలకు అంతరాయం కలగనుందని తెలిపింది. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌/యోనో/యోనో లైట్‌ సేవలు ఈ 45 నిమిషాల పాటు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ తెలిపింది. ఈ విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని ట్వీట్ చేశారు. మరి ఈ సమయాల్లో ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేసేవారుంటే ముందుగానే జాగ్రత్త పడండి.

ఎస్‌బీఐ ట్వీట్‌..

Also Read:  Corona Affect on Restaurants: కరోనాతో భారీగా దెబ్బతిన్న రెస్టారెంట్ రంగం.. దేశవ్యాప్తంగా ఎన్ని రెస్టారెంట్లు మూత పడ్డాయంటే..

Stock Market: వారం రోజుల్లో రూ.10వేల పెట్టుబడికి రూ.15వేలు..లాభాల పంట పండిస్తున్న ఆ షేర్

Airtel Postpaid: పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరలను పెంచిన ఎయిర్‌టెల్..ఇకపై ఆ ప్లాన్‌లు ఉండవు.. ఎందుకంటే..