AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumal News: తిరుమల ఆలయ రక్షణ వ్యవస్థలో హై టెక్నాలజీ.. ఇక అలాంటివి ఎగరడం కష్టమే..

ఉగ్ర కుట్రలను టెక్నాలజీతో తిప్పికొట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా డ్రోన్ జామర్ టెన్నాలజీని తిరుమల కొండపైన ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tirumal News: తిరుమల ఆలయ రక్షణ వ్యవస్థలో హై టెక్నాలజీ.. ఇక అలాంటివి ఎగరడం కష్టమే..
Sanjay Kasula
|

Updated on: Jul 23, 2021 | 6:07 PM

Share

ఉగ్ర కుట్రలను టెక్నాలజీతో తిప్పికొట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా డ్రోన్ జామర్ టెన్నాలజీని తిరుమల కొండపైన ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానంను అప్రమత్తం చేశాయి. దీంతో డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ సహాయంతో తిరుమలలోని వెంకటేశ్వర ఆలయ రక్షణ వ్యవస్థలో ఉపయోగించనున్నారు.

DRDO సహకారంతో యాంటీ-డ్రోన్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్న ఘనత దేశంలో మొట్టమొదటి సారి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కు దక్కుతుంది. జమ్ములోని ఒక వైమానిక దళంపై ఉగ్రవాద దాడి తరువాత..యాంటీ డ్రోన్ టెక్నాలజీని DRDO అభివృద్ధి చేసింది.కర్ణాటకలోని కోలార్ వద్ద జూలై 6 న మూడు రకాల టెక్నాలజీని ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు శాఖల ప్రతినిధులతోపాటు టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ వింగ్ చీఫ్, గోపీనాథ్ జట్టి హాజరయ్యారు. ఆ తర్వాత ఈ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. రూ. 22 కోట్లతో కొనుగోలు చేస్తున్నారు.

DRDO నేతృత్వంలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ…

డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. డి-4 డ్రోన్‌ వ్యవస్థగా పిలిచే దీని ద్వారా డ్రోన్‌ దాడుల ముప్పు నుంచి దేశ రక్షణ కేంద్రాలను కాపాడుకోవచ్చు. నాలుగు కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను ఈ వ్యవస్థ గుర్తించి దాడి చేస్తుంది. అత్యంత కీలక ప్రాంతాలపై దాడి చేసే డ్రోన్లను ఇది ప్రధానంగా గుర్తించి ధ్వంసం చేస్తుంది. డి-4 డ్రోన్‌ వ్యవస్థలో అనేక సెన్సార్లు, డ్రోన్లపై ఎదురు దాడి చేసే రెండు విధ్వంసకర పరికరాలు ఉన్నట్లు డీఆర్డీవోకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ డ్రోన్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌ను జామ్ చేస్తుంది. అంతేకాదు డ్రోన్‌ల హార్డ్‌వేర్‌ను నాశనం చేయనుంది.

ఇదిలావుంటే.. టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆదేశాలతో ఈవీ జవహార్ రెడ్డి కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. సాధ్యమైనత త్వరలోనే తిరుమల కొండపై ఈ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: గుడిలో కుడికాలు పెట్టలేదని నవవధువు చెంప చెళ్ళుమనిపించిన ఆడపడుచు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

క్యూట్ స్మైల్‌‌‌‌తో కట్టిపడేస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?