Karna-Moral Story: దానకర్ణుడు ఆకలితో అలమటించిన వైనం… అన్నదానం విశిష్టతను చెప్పిన కర్ణుడి ఆకలి, దాహం
Mahabharata Moral Story: అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం అన్ని దానాల్లోకంటే గొప్పదని పెద్దలు చెబుతారు.. విద్యాదానం, వస్త్రదానం ఇలా ఎన్ని దానాలున్నా..
Mahabharata Moral Story: అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం అన్ని దానాల్లోకంటే గొప్పదని పెద్దలు చెబుతారు.. విద్యాదానం, వస్త్రదానం ఇలా ఎన్ని దానాలున్నా అన్ని దానాల్లో కెల్లా అన్నదానం మిన్న. ఎందుకంటే ఎదుటివారి అవసరానికి మనం ఎంత సాయం చేసినా ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలి అనిపిస్తుంది. అదే ఆకలి అన్నవారికి అన్నం పెడితే మాత్రం ఇక చాలు అంటూ సంతృప్తిగా వెళ్తారు. అంతగొప్పది అన్నదానం. ఎన్ని యజ్ఞాలు చేసినా రాని పుణ్యం అన్నదానం చేస్తే లభిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. ఈ అన్నదానం విశిష్టత గురించి తెలియజేస్తూ.. దానకర్ణుడు ఆకలి.. అన్నదాన మహత్యం గురించి పరమాచార్య స్వామివారు చెప్పిన కథ గురించి ఈరోజు తెలుసుకుందాం..
రాధేయుడు కర్ణుడు బంగారం , ధనంను దానంగా ఇచ్చినవాడు. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, డబ్బు, పాత్రలు. ఇలా ఏదడిగినా లేదనకుండా ఇచ్చాడు.. చివరకు తనకు ప్రాణ హాని ఉందని తెలిసినా శ్రీకృష్ణుడు అడిగిన వెంటనే తన సహజకవచ కుండలాలను దానం గా ఇచ్చాడు. అంతటి మాహావ్యక్తి కర్ణుడు.. కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు వదిలిన తరువాత కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు.
కర్ణుడికి చాలా ఆకలిగా ఉంది. చుట్టూ ఉన్న పాత్రల్లో వజ్రాలు, వైఢూర్యాలు , బంగారం వున్నాయి. కానీ ఒక్క పిడికెడు వండిన అన్నం కానీ గుక్కెడు నీరు కానీ లేదు. దీంతో కర్ణుడు ఆకలి, దాహంతో అలమటిస్తూ.. ఎందుకు ఇలా?” అని అక్కడున్నవారిని అడిగాడు. “నువ్వు దానశూరుడివి, అందులో సందేహం లేదు. ఎంతో బంగారం, వెండి దానం చేశావు. కానీ నువ్వు ఎప్పుడూ అన్నదానం చెయ్యలేదు. అక్కడ నువ్వు ఇచ్చినదే ఇక్కడ నీకు దొరుకుతుంది” అని చెప్పారు. దీంతో కర్ణుడు తాను ఈ ధర్మ సూక్ష్మాన్ని ఎందుకు గ్రహించలేకపోయాను అంటూ ఫీల్ అయ్యాడు.. ఇది తనకు అవమానంగా భావించాడు. అయితే కర్ణుడికి ఆకలి ఎక్కువ అయ్యింది. దీంతో అక్కడ ఉన్న ఒక మహర్షిని ఆకలి తీర్చమని అడిగాడు. అప్పుడు కర్ణుడుతో నీ ఆకలి తీరడానికి నీ చూపుడు వేలుని నోట్లో పెట్టుకో.. అప్పుడు నీకు ఆకలి తీరుతుంది అని చెప్పారు. ఎందుకు అని కర్ణుడిలో సందేహం కలిగితే.. ఒకసారి కొందరు ఆకలితో నీ దగ్గరకు వచ్చారు.. అప్పడూ నీవు వాళ్ళకి ఆకలి తీర్చలేదు కానీ.. ఆకలి తీరే మార్గం చూపిస్తూ.. నీ చూపుడు వేలిని చూపిస్తూ.. దుర్యోధనుడి ఇంటికి వెళ్ళమని చెప్పావు. అందుకే నీ చూపుడు వెలికి నీ ఆకలిని తీర్చే శక్తి ఉంది. అనగానే కర్ణుడు ఆ మహర్షి చెప్పినట్లే చేశాడు.. వెంటనే కర్ణుడి ఆకలి తీరింది. అందుకనే మన పెద్దలు అన్నదానాల్లోకి కంటే అన్నదానం గొప్పది అని అన్నారు.
Also Read: Corona Virus: ఆ దేశంలో మొదలైన కరోనా నాల్గో వేవ్ .. భారీగా కొత్త కేసులు.. ఆంక్షలు కఠినతరం