AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల..
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రెండో సంవత్సర ఫలితాలు వచ్చేశాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రెండో సంవత్సర ఫలితాలు వచ్చేశాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5.10 లక్షల మంది ఉన్నారు.
మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ.. పరీక్షలు నిర్వహించే సమయంలో కరోనా విజృంభించిందన్నారు. కోవిడ్ జాగ్రత్తలతో పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. అయితే.. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు పరీక్షలు రద్దు చేసి ద్వితీయ సంవత్సర విద్యార్థులను పాస్ చేసినట్లుగా తెలిపారు. సెకండియర్ విద్యార్థులందరూ పాస్ అయినట్లు ఆయన ప్రకటించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నామన్నారు.
సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దు చేశామని, కరోనా నిబంధనలు పాటించి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై సూచనల కోసం ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సూచనల మేరకు టెన్త్, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్స్ మార్కుల ఆధారంగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై బోర్డు కసరత్తు జరిపి ఫలితాలను విడుదల చేశామన్నారు. 31 జులై లోపు పరీక్ష ఫలితాలు ప్రకటించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో…కోర్టు ఇచ్చిన సమయం కంటే వారం రోజుల ముందుగానే ఫలితాలను ప్రకటిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు.
ఇతర రాష్ట్రాలు మార్కులు ఇస్తున్న నేపథ్యంలో మార్కులు కోసం ఒక పద్ధతిని ఎంచుకున్నామన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చాయారతన్ నేతృత్వంలో కమిటీ వేసి ఫలితాలను అందించినట్లుగా చెప్పారు. మొదటి ఏడాదిలో ఫెయిల్ అయిన వారికి ఆబ్సెంట్ అయిన వారికి మినిమం మార్క్స్ ఇచ్చినట్లుగా తెలిపారు.
విద్యార్థులు తమ పరీక్షాల ఫలితాలను ఇక్కడ చూడండి…
10th తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో సాధించిన మార్కులను ఆధారంగా చేసుకొని ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. థియరీ పేపర్ మార్కుల కోసం.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల నుంచి 70 శాతం వేయిటేజ్, 10వ తగరతిలో వచ్చిన మార్కుల నుంచి 30 శాతం వెయిటేజ్‌గా తీసుకొనున్నారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలకు విషయానికొస్తే ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు ఇంటర్మిడియట్ బోర్డు ఇప్పటికే వివరణ ఇచ్చింది.