ICSE, ISC Results: నేడే ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షా ఫలితాలు.. మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల. ఎలా చెక్ చేసుకోవాలంటే.
ICSE, ISC Results 2021: ఐసీఎస్ఈ, ఐఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు నేడు (శనివారం) విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (CISCE) అధికారికంగా తెలిపింది. నిజానికి ఈ ఫలితాలను...
ICSE, ISC Results 2021: ఐసీఎస్ఈ, ఐఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు నేడు (శనివారం) విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (CISCE) అధికారికంగా తెలిపింది. నిజానికి ఈ ఫలితాలను శుక్రవారమే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల నేటికి వాయిదా పడింది. ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ) 10వ తరగతి, ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్(ఐఎస్ఈ) 12వ తరగతి ఫలితాలను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
ఇక కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని పరీక్షలను రద్దు చేసినట్లే వీటిని కూడా ఐసీఎస్‌ఈ రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థలు ప్రతిభ ఆధారంగా ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు వారికి వచ్చిన మార్కులకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. వాటిని వారి వారి పాఠశాలల్లోనే విన్నవించాలని బోర్డు సూచింది. ఇందుకోసం అధికారులు ఆగస్టు 1 వరకు గడువు ఇచ్చారు. పరీక్షా ఫలితాలను పొందాలనుకునే వారు cisce.org లేదా results.cisce.orgలో రిజల్ట్స్‌ను చూసుకోవచ్చు. ఇక పాఠశాలలు కూడా విద్యార్థుల ఫలితాలను ఐసీఎస్‌ఈ పోర్టల్‌లోని కెరీర్స్ విభాగం నుంచి పొందొచ్చని సీఐఎస్‌సీఈ కార్యదర్శి జెర్నీ అరాథూన్ తెలిపారు.
Also Read: AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల..