DTU Recruitment 2021: ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హలు..
DTU Recruitment 2021: దేశరాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో...
DTU Recruitment 2021: దేశరాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాల్లో ఈ పోస్టులను తీసుకోనున్నారు. * పైన తెలిపిన ఖాళీలు.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నాయి. * ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పరిశోధన/టీచింగ్ అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి హార్డ్ కాపీని పంపించాలి. * హార్డ్ కాపీని రిక్రూట్‌మెంట్ బ్రాంచ్, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, షాబాద్ దౌలత్‌పూర్, భావనా రోడ్, ఢిల్లీ–110042 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్/ప్రజంటేషన్/ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు. * ఆన్‌లైన్ దరఖాస్తులకు 09-08-2021 చివరి తేదీకాగా.. దరఖాస్తు హార్డ్ కాపీని పంపించడానికి 18-08-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..