AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BEL Recruitment: హైదరాబాద్‌ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అకడమిక్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌ యూనిట్‌లో పలు విభాగాల్లో...

BEL Recruitment: హైదరాబాద్‌ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అకడమిక్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
Bel Recruitment
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 23, 2021 | 9:09 AM

Share

BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌ యూనిట్‌లో పలు విభాగాల్లో ప్రాజెక్టు ఇంజనీర్‌ భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 49 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల్లో భాగంగా ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 36 పోస్టులు, మెకానికల్‌ విభాగంలో 08, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 04, హ్యూమన్‌ రిసోర్సెస్‌ 01 ఖాళీలున్నాయి. * పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజనీరింగ్), హ్యూమన్‌ రిసోర్స్‌ స్పెషలైజేషనత్‌లో ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంహెచ్‌ఆర్‌ఎం/ఎంఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. * సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి. * అభ్యర్థులను అకడమిక్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 04-08-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: విద్యావ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి 12 తరగతుల వరకు స్కూల్ ఎడ్యుకేషన్..

TCS Infosys Wipro HCL: ఐటీ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌.. కంపెనీల్లో ఫ్రెషర్స్​ కోసం లక్షకుపైగా ఉద్యోగాలు..!

JEE Mains 2021: జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరవుతున్నారా.. ఈ మార్గదర్శకాలు పాటిస్తున్నారా.. తెలుసుకోండి..!