TCS Infosys Wipro HCL: ఐటీ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్.. కంపెనీల్లో ఫ్రెషర్స్ కోసం లక్షకుపైగా ఉద్యోగాలు..!
TCS Infosys Wipro HCL: భారతదేశంలో ఉన్న టాప్ మూడు ఐటీ కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడంలో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష..
TCS Infosys Wipro HCL: భారతదేశంలో ఉన్న టాప్ మూడు ఐటీ కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడంలో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష మందికి పైగా ఫ్రెషర్స్‌ను నియమించుకోవాలని భావిస్తు్న్నాయి. ఐటీ సర్వీస్‌లకు డిమాండ్ పెరుగుతుండడంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు హైరింగ్ యాక్టివిటీని పెంచాయి. టీసీఎస్ ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 20 వేల మందిని తీసుకుంది. ఇన్ఫోసిస్ 8,300 మందిని, విప్రో 12 వేల మందిని హైర్ చేసుకున్నాయి. గత ఏడాది జూన్ త్రైమాసికంలో 40 వేల మంది ఫ్రెషర్స్‌కు టీసీఎస్ ఉద్యోగాలను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా 40 వేలు లేదా అంతకంటే ఎక్కువ మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంటామని టీసీఎస్ వెల్లడించింది.
ఇన్ఫోసిస్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్‌గా 35 వేల మందిని నియమించుకుంటామని ప్రకటించింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 10 వేల మంది సీనియర్లను, 2 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకున్నామని విప్రో ప్రకటించింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో మరో 6 వేల మందిని హైర్ చేసుకోవడానికి కంపెనీ ప్లాన్స్ వేస్తోంది. 2022–23 నాటికి మొత్తం30 వేల మందికి ఆఫర్ లెటర్స్ అందించాలని చూస్తోంది.