AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Class 10th Result 2021: సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఇలా సులువుగా తెలుసుకోండి.. వివరాలివే

CBSE Class 10th Class Result: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు

CBSE Class 10th Result 2021: సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఇలా సులువుగా తెలుసుకోండి.. వివరాలివే
CBSE 10th Result 2021
Shaik Madar Saheb
|

Updated on: Jul 20, 2021 | 12:32 PM

Share

CBSE Class 10th Class Result: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలో సీబీఎస్‌ఈ వెల్లడించిన సమాచారం ప్రకారం.. పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం (నేడు) వెలువడే అవకాశముందని పేర్కొంటున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఫలితాలను ప్రకటించే అవకాశముందని పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు తమ 10వ తరగతి ఫలితాలను చూసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. పదో తరగతి ఫలితాలపై సీబీఎస్ఈ, కేంద్ర విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఫలితాలను సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ cbse.nic.in, cbse.gov.in లో చూసుకోవచ్చని బోర్డు పేర్కొంది.. అయితే.. ఫలితాలు విడుదలైన వెంటనే సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. సర్వర్ క్రాష్‌ వల్ల చాలామందికి అసౌకర్యం కలుగుతుంటుంది. అలాంటప్పుడు ఈ కింద పేర్కొన్న వెబ్‌సైట్లను ఫాలో అయితే.. ఫలితాలను తొందరగా తెలుసుకోవచ్చంటున్నారు అధికారులు. అవేంటో తెలుసుకుందాం..

ఉమాంగ్ యాప్ ద్వారా.. ఉమాంగ్ యాప్ ద్వారా సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్న వారు ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా.. లేదా.. వెబ్‌సైట్‌లో పది ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

టెలిఫోన్ లేదా ఐవీఆర్ఎస్ ద్వారా టెలిఫోన్ కాల్ లేదా ఐవీఆర్ఎస్ ద్వారా సీబీఎస్ఈ బోర్డ్ ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోతే.. విద్యార్థులు ఫోన్ లేదా ఐవిఆర్ఎస్ లైన్‌కు కాల్ చేయవచ్చు. వాటికి సంబంధించిన నెంబర్లను సీబీఎస్ఈ ఫలితాల సమయంలో విడుదల చేస్తుంది.

ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను తెలుసుకోవచ్చు. పదో తరగతి ఫలితాలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థులు ఫోన్‌ ద్వారా ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సులువుగా పొందవచ్చు. వీటి వివరాలను సీబీఎస్ఈ త్వరలో విడుదల చేయనుంది.

పలు వెబ్‌సైట్‌ల ద్వారా.. సీబీఎస్ఈ ఫలితాలను మరో ప్రత్యామ్నాయ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాల రోజు బోర్డు అధికారిక వెబ్‌సైట్లు మందగించే అవకాశముంది. దీంతోపాటు సైట్ క్రాష్ కావచ్చు. ఇలాంటి సందర్భంలో.. examresults, indiaresults.com వంటి వెబ్‌సైట్లలో తనిఖీ చేయవచ్చు.

డిజిలాకర్ యాప్ ద్వారా.. డిజిలాకర్ యాప్ ద్వారా సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులు ఫలితాలతోపాటు.. తమ ధృవపత్రాలను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఈ డిజిలాకర్ యాప్ ఐటి మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఇది డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్‌‌గా ఉపయోగపడుతుంది.

Also Read:

Minor Arrest: పది కూడా పాస్ కాలేదు.. ఏకంగా ఫారిన్ నెంబర్లతో దడదలాడించేస్తాడు.. కన్నుపడిదంటే అంతే సంగతులు..

Moderna vaccine: భారత్‌కు 75 లక్షల మోడెర్నా వ్యాక్సిన్ డోసులు.. అందించనున్న డబ్ల్యూహెచ్ఓ