AP Inter Results: ఇంటర్మీడియట్ ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నారా?.. అయితే అందుకు సిద్ధమవండి..

AP Inter Results: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నాడు ఇంటర్మీడియట్ సెంకడ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసిన విషయం..

AP Inter Results: ఇంటర్మీడియట్ ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నారా?.. అయితే అందుకు సిద్ధమవండి..
Ap Inter Results
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 24, 2021 | 8:41 AM

AP Inter Results: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నాడు ఇంటర్మీడియట్ సెంకడ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. విద్యార్థులకు మార్కులను ప్రకటించింది. శుక్రవారం నాడు సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను ప్రకటించారు. అయితే, ప్రభుత్వం ప్రకటించిన ఈ ఫలితాలపై విద్యార్థులకు అసంతృప్తి ఉంటే కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఫలితాలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసిన విద్యార్థులకు కోవిడ్ తగ్గిన తరువాత పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే బెటర్‌మెంట్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు.

అయితే, విద్యార్థులకు భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా మార్కులే ప్రకటించామని మంత్రి అన్నారు. ఇక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తున్నామని మంత్రి సురేష్ ప్రకటించారు. ఇక పదవ తరగతి ఫలితాలను కూడా మరో వారం రోజుల్లో ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఆ తరువాత అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

Also read:

AP Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన..

Telangana Jobs: 95% కొలువులు స్థానికులకే.. జోనల్ వ్యవస్థ అమలుపై కీలక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ జీఏడీ..

TS Eamcet Hall Tickets: టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుద‌ల‌.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..