AP Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన..

AP Weather Alert: యవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు..

AP Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 24, 2021 | 8:36 AM

AP Weather Alert: యవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉందని తెలిపారు. ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని అధికారులు తెలిపారు. కాగా, ఈ అల్పపీడనం ప్రభావంతో.. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, నాలుగైదు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.

ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి.. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది పోటెత్తుతోంది. వరద తాకిడి భారీగా ఉండటంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచంలం వద్ద గోదావరి నది నీటిమట్టం 26.50 అడుగలకు పెరిగింది. వదర ప్రవాహం కొనసాగుతుండటంతో.. ఇవాళ సాయంత్రానికి 43 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక గోదావరి నది ఉధృతి పోలవరం ప్రాజక్టు వద్ద ఎక్కువగా ఉంది. దాంతో అలర్ట్ అయిన అధికారులు.. స్పిల్‌వేకు ఏర్పాటు చేసిన 46 గేట్లను ఎత్తివేసి రాజమండ్రి వైపు 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 1,64,897 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల వరకు గోదావరికి వరద ప్రవాహం ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

శ్రీశైలం జలాశాయానికి పెరుగుతున్న వరద.. కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కర్ణాటక నుంచి జూరాలకు భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో.. నీటిని కిందకు వదిలారు. జూరాల ప్రాజెక్టు నుంచి 1,92,035 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. డ్యామ్ గరిష్ట నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 77.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగుల కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 849 అడుగల మేరకు ఉంది.

Also read:

Telangana Jobs: 95% కొలువులు స్థానికులకే.. జోనల్ వ్యవస్థ అమలుపై కీలక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ జీఏడీ..

TS Eamcet Hall Tickets: టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుద‌ల‌.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Guru Purnima 2021: గురు పూర్ణిమ శుభ ముహుర్తము.. ప్రాముఖ్యత.. ఈరోజున ఏం చేయాలంటే..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!