TS Eamcet Hall Tickets: టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
TS Eamcet Hall Tickets: టీఎస్ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లను విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ అయిన..
TS Eamcet Hall Tickets: టీఎస్ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లను విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ అయిన eamcet.tsche.ac.in నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. అభ్యర్థులు.. ఈనెల 31వ తేదీ వరకు తమ తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. కాగా, ఎంసెట్ పరీక్షలను ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి ఆగస్టు 4, 5, 6 తేదీల్లో.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ గ్రూప్ కోసం ఆగస్టు 9, 10 తేదీల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
ఇదిలాఉంటే.. ఇప్పటి వరకు ఎంసెట్‌కు 2.49 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. వీటిలో ఇంజనీరింగ్‌కు 1.63 లక్షల దరఖాస్తులు, ఫార్మా, అగ్రికల్చర్ కు 85,828 అప్లికేషన్లు వచ్చాయన్నారు. అయితే, ఎంసెట్ ఎంట్రన్స్ దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. రూ. 500 ఆలస్యం రుసుముతో ఈ నెల 29వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎంసెట్, నీటీ, ఐఐటీ కోసం సిద్ధమయ్యే విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త చెప్పారు. సదరు కోర్సుల్లో ప్రవేశాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత కోచింగ్ అందిస్తోందన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. నిష్టాతులైన లెక్చరర్లతో ఈ కోచింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ కోచింగ్‌ను http://tscie,rankr.io లింక్ ద్వారా పొందవచ్చునని మంత్రి సబితా ఇంద్రరెడ్డి తెలిపారు.
Also read:
Guru Purnima 2021: గురు పూర్ణిమ శుభ ముహుర్తము.. ప్రాముఖ్యత.. ఈరోజున ఏం చేయాలంటే…
Ramyakrishna : కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ పై సినీనటి రమ్యకృష్ణ అద్భుతమైన రియాక్షన్