ACB: రైతు సొమ్ముకే ఆశపడ్డాడు.. బీమా క్లైమ్ చేసుకునేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు.. చివరికి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు!
రైతు బీమా ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు ఓ అవినీతి అధికారి. మరణం అనంతరం వచ్చే అన్నదాత సొమ్మునే పంచుకోవాలనుకున్నాడు. ఏసీబీ అధికారుల రాకతో అధికారి గుట్టరట్టైంది.
Agriculture Oficer in ACB Trap: ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. చేసిన కష్టం చేతికి రాక, అప్పులు తీరక సతమతమవుతున్న రైతన్నలు ఆసువులు బాస్తున్నారు. అయితే, వారి కష్టం తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు ఓ అవినీతి అధికారి. మరణం అనంతరం వచ్చే అన్నదాత సొమ్మునే పంచుకోవాలనుకున్నాడు. ఏసీబీ అధికారుల రాకతో అధికారి గుట్టరట్టైంది. రైతు బీమా డబ్బులు క్లైమ్ చేసుకునేందుకు గాను లంచం డిమాండ్ చేసిన మిర్యాలగూడ వ్యవసాయ అధికారి బొలిశెట్టి శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడ్డాడు.
మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు అన్వేష్ రెడ్డి ఇటీవల మృతి చెందాడు. కాగా, రైతు బీమా డబ్బులు క్లైమ్ చేసుకునేందుకు అతడి బంధువు శ్రీనివాస్ రెడ్డి ఏవో శ్రీనివాస్‌ను ఆశ్రయించాడు. ఫైల్ మూవ్ చేసేందుకు పదిహేను వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని రూ. 12,000 ఒప్పందం చేసుకున్నాడు. అయినా ససేమిరా అననడంతో.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్కా ఫ్లాన్ చేసిన ఏసీబీ అధికారులు ఏవోను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీ అధికారుల సూచనల మేరకు పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ షాప్ లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఇందుకు సంబంధించి సదరు అధికారిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Read Also…
పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని యువతి ఆత్మహత్యయత్నం.. కానిస్టేబుల్ అప్రమత్తంతో తప్పిన ముప్పు.. అసలేం జరిగిందంటే.?
Karthika Deepam Latest: 25 తేదీ తరువాత ఈయన మన ఉమ్మడి మొగుడు..ఆయన కామన్ మామగారు.. దీపతో మోనిత ఛాలెంజ్!