Telangana Corona: తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఎన్నంటే..

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,20,530 సాంపిల్స్ పరీక్షించగా.. 643 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో...

Telangana Corona: తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఎన్నంటే..
Telangana Corona
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 23, 2021 | 8:29 PM

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,20,530 సాంపిల్స్ పరీక్షించగా.. 643 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో6,40,012 మంది కరోనా బారిన పడ్డారు. ఇక ఒక్క రోజులో 767 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి ఇప్పటి వరకు 6,26,505 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఈ మహమ్మారి కారణంగా ఒక్క రోజులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కరోనా వైరస్ ప్రభావంతో 3,778 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో రికవరీ రేటు97.88 శాతం ఉంది. మరణాట రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 9,729 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 77 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో కరీంనగర్ జిల్లాలో 68 కేసులు నమోదు అయ్యాయి.

ప్రస్తుతానికి కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని హితవు చెబుతున్నారు. ఒకవేళ బయటకు వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.

ఇవి కూడా చదవండి: Telangana Politics 2023: తెలంగాణలో రాజకీయ రణం మొదలైందా.. ఈ పోరు ఆ దిశగానేనా..

 TTD – Anti Drone: తిరుమల కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ.. ఆలయ రక్షణలో డీఆర్‌డీవో సాంకేతికత

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల..