AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఆ విషయంలో రిస్క్ తీసుకోవడం చాలా అవసరం.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది హీరోయిన్ సమంత. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. మరోవైపు నిర్మాతగానూ రాణిస్తుంది. తాజాగా సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Samantha: ఆ విషయంలో రిస్క్ తీసుకోవడం చాలా అవసరం.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..
Samantha
Rajitha Chanti
|

Updated on: May 01, 2025 | 12:23 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ సమంత ఇప్పుడు నిర్మాతగానూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం సామ్ నిర్మించిన చిత్రం శుభం. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. కొన్ని రోజులుగా ఆరోగ్య విషయాలు.. వ్యాయామ వీడియోస్ షేర్ చేస్తుంది సామ్. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నటి సమంత, చికిత్స తర్వాత ఇప్పుడు తిరిగి నటనను ప్రారంభించింది. ప్రస్తుతం సినిమాల్లో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె తెరకెక్కించిన శుభం చిత్రం మే 9న రిలీజ్ కానుంది.

సమంత ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా, ఇందులో ఒక ప్రత్యేక పాత్రను కూడా పోషిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “రిస్క్ తీసుకోకుండా సినిమాలో అర్థవంతమైన మార్పును ఆశించలేము. నేను ఎప్పుడూ రిస్క్ తీసుకోవడం నుండి వెనక్కి తగ్గలేదని నేను అనుకుంటున్నాను. చాలావరకు నష్టాలు చూశాను. దాదాపు 15 సంవత్సరాలుగా నటిగా నేను ఎన్నో నేర్చుకున్నాను. అందుకే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న కథలపై నమ్మకంగా ఉండటానికి అవసరమైన అంతర్దృష్టి, అనుభవాన్ని పొందానని నేను నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది సామ్.

తన నిర్మాణ బ్యానర్ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ గురించి మాట్లాడుతూ.. అందులో అద్భుతమైన టీమ్ తనకు సహకరిస్తుందని అన్నారు. అలాగే తాము ఒకరినొకరు పూర్తిగా ఆదరిస్తామనే నమ్మకం మాకు ఉందన్నారు. ఎప్పుడూ తటస్థంగా లేదా అర్ధహృదయంతో లేని రచనలను విడుదల చేయడానికి ఉద్దేశపూర్వకంగా కట్టుబడి ఉన్నామని అన్నారు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..