Samantha: అల్లు అర్హ గురించి సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కూతురి కెరీర్ విషయంలో బన్నీ జోక్యం చేసుకోరంటూ….
గత కొద్ది రోజులుగా డైరెక్టర్ గుణశేఖర్ తోపాటు.. సమంత..మిగతా చిత్రయూనిట్ సభ్యులు ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి ముంబై మీడియాతో పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు సమంత. అలాగే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో అర్హ బాలనటిగా నటించింది.

శకుంతల దుష్యంతుల అమరప్రేమగాథ శాకుంతలం ఈ నెల 14న విడుదల కానుంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో దేవ్ మోహన్ కథానాయికుడిగా కనిపిస్తుండగా.. ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమయిన ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. గత కొద్ది రోజులుగా డైరెక్టర్ గుణశేఖర్ తోపాటు.. సమంత..మిగతా చిత్రయూనిట్ సభ్యులు ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి ముంబై మీడియాతో పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు సమంత. అలాగే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో అర్హ బాలనటిగా నటించింది.
సమంత మాట్లాడుతూ.. “నా దృష్టిలో అల్లు అర్హ స్వయంస్వతంత్రురాలు. తనకు కావాల్సిన నిర్ణయాలు తానే తీసుకోగలదు. ఆమె తండ్రి (అల్లు అర్జున్) ఆమె విషయాల్లో కలగజేసుకోవాల్సిన అవసరం లేదు. ఆమె కెరీర్ విషయంలోనూ అతని జోక్యం అవసరం లేదు. ఆమె కెరీర్‌లో ఇది అద్భుతమైన చిత్రం. అర్హ రోల్ చాలా అద్భుతంగా వచ్చింది. లీడ్ కేరక్టర్లన్నీ ఒక ఎత్తు, అర్హ రోల్ మరో ఎత్తు. అంత బాగా వచ్చింది. అందుకే పిల్లలు, ఫ్యామిలీస్ ఈ కథను ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను.” అని అన్నారు.




ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాక జీవితం ఎలా మారింది? అని అడిగితే, సమంత సరదాగా స్పందించారు. తాను ప్యాన్ ఇండియా స్టార్‌ననే విషయాన్ని తన పెంపుడు జంతువులకి ఎవరైనా చెబితే బావుంటుందని అన్నారు. నేనింకా వాటిని శ్రుభ్రం చేస్తున్నాను. నా జీవితం మారిందని నేను అనుకోలేదు. నేను ఆరు గంటల దాకానే స్టార్‌ని. ఆ తర్వాత నా జీవితం చాలా సాదాసీదాగా ఉంటుంది. నేను ఇక్కడిదాకా వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నేను చేస్తున్న పాత్రల విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. గర్వపడుతున్నాను. నేను చేస్తున్న పని కష్టతరమైనదే. యాక్షన్ పాత్రలు కూడా చేస్తున్నాను. ఫ్యామిలీమేన్2లో నేను చేసిన కేరక్టర్ అలాంటిదే. ఎప్పుడూ స్క్రీన్ మీద ఎవరో ఒక హీరో వచ్చి కాపాడుతుంటే, బేలగా ఉండే పాత్రలే చేయక్కర్లేదు. సబలగా కూడా నటించాలి. అలా నటించడం కొత్తగా ఉంది. దాన్ని ఆస్వాదిస్తున్నాను. చాలా ఆనందంగా అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు.