Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల హంగామా.. బన్నీ సింప్లిసిటికి ఫ్యాన్స్ ఫిదా..

బన్నీని కలిసేందుకు అతని అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. తన కోసం ఇంటివద్దకు చేరుకున్న అభిమానులను కలిసేందుకు బన్నీ బయటకు వచ్చి.. వారిని ఆప్యాయంగా పలకించారు. బన్నీతోపాటు.. ఆయన కూతురు అల్లు అర్హ.. కుమారుడు అయాన్ సైతం బయటకు వచ్చి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల హంగామా.. బన్నీ సింప్లిసిటికి ఫ్యాన్స్ ఫిదా..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 08, 2023 | 3:18 PM

పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. పుష్ప సినిమాతో ఈ హీరో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈరోజు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు.. అభిమానులకు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. డైరెక్టర్ సుకుమార్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియా వేదికగా బన్నీకి విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే బన్నీని కలిసేందుకు అతని అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. తన కోసం ఇంటివద్దకు చేరుకున్న అభిమానులను కలిసేందుకు బన్నీ బయటకు వచ్చి.. వారిని ఆప్యాయంగా పలకించారు. బన్నీతోపాటు.. ఆయన కూతురు అల్లు అర్హ.. కుమారుడు అయాన్ సైతం బయటకు వచ్చి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా నిన్న విడుదలైన పుష్ప 2 టీజర్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్ అంటూ విడుదలైన ఈ గ్లింప్స్ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని పులి సీన్ అయితే టీజర్ కు హైలెట్ గా నిలిచింది. దీంతో విడుదలైన గంటల వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ పైగా రాబట్టింది.

ఇప్పటివరకు తెలుగులో 18 మిలియన్ వ్యూస్ రాబట్టడం విశేషం.. ఇక హిందీలో ఏకంగా 20 మిలియన్ వ్యూస్ రాబట్టింది. మొత్తానికి బన్నీ టీజర్ తోనే రికార్డ్స్ మోత షూరు చేశారు. కొద్ది రోజులుగా పుష్ప 2 చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.